ఇజ్రాయిల్ – పాలస్తీనా సంక్షోభానికి అసలు కారణం ఏంటి?

isreal, palastina, war, crisis
isreal, palastina, war, crisis

గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచం అంతటా వినిపిస్తున్న అంశం… ఇజ్రాయిల్ కు- పాలస్తీనాలోని మిలిటెంట్ల సంస్థ హమాస్ కు మధ్య కొనసాగుతున్న యుద్ధం. అయితే ఈ యుద్ధం నిన్న మొన్నటి నుంచి కాదు దీనికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. 1914 వరకు పాలస్తీనాను ఒట్టోమన్ సామ్రాజ్యం పాలన సాగింది. పాలస్తీనాలో అరబ్ లు మెజార్టీగా, యూదులు మైనార్టీ గా ఉండేవారు. మొదటి ప్రపంచ యుద్ధంలో ఒట్టోమన్ సామ్రాజ్యం ఓడిపోయిన తర్వాత పాలస్తీనా బ్రిటన్ నియంత్రణలోకి పోయింది. ఆ తర్వాత పాలస్తీనా లో ఉన్న యూదులకు ప్రత్యేక రాజ్యం ఏర్పాటు చేసే బాధ్యతను అంతర్జాతీయ సమాజం బ్రిటన్ కు అప్పగించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి. యూదులు పాలస్తీనా ప్రాంతాన్ని తమ పూర్వీకుల నివాసంగా భావిస్తారు. పాలస్తీనా అరబ్బులు కూడా అది తమ మాతృభూమిగా చెప్పుకుంటారు.

1920-1940 లో అక్కడికి వచ్చి చేరిన యూదుల సంఖ్య క్రమంగా పెరిగింది. వాళ్లు యూరప్ లో ముఖ్యంగా హిట్లర్ సమయంలో జర్మనీలో తమపై జరుగుతున్న హింస కాండను తప్పించుకోవడానికి అనేక మంది అక్కడి నుంచి పారిపోవడానికి పాలస్తీనా చేకున్నారు. కానీ అక్కడ కూడా శాంతి లేదు. అంతేకాదు యూదులు అరబ్బుల మధ్య హింస పెరుగుతూ వచ్చింది. బ్రిటిష్ పాలకుల పట్ల వ్యతిరేకత పెరుగుతూ వచ్చింది. 1947 బ్రిటీషర్లు పాలస్తీనాను వీడి వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు. పాలస్తీనాను రెండుగా విభజించి యూదులకు, అరబ్బులకు పంచి ఇవ్వాలని జరుసలేం ను అంతర్జాతీయ నగరంగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితి సిఫార్సు చేసింది. అయితే ఈ ఆఫర్ కి యూదులు ఒప్పుకున్నారు. కానీ అరబ్ ముస్లీంలు ఒప్పుకోలేదు. దీంతో ఈ వివాదాన్ని పరిష్కరించలేక బ్రిటీషర్లు చేతులెత్తేశారు.

1948 తర్వాత బ్రిటీషర్స్ ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లాక యూదులు ఇజ్రాయిల్ దేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని అనేక మంది పాలస్తీనీయులు తిరస్కరించడంతో యుద్ధం అనివార్యమైంది. పొరుగున ఉన్న అరబ్ దేశాల సైన్యాలు కూడా దాడులు చేశాయి. లక్షల మంది పాలస్తీనీయులు ఇల్లు వాకిలి వదిలి చుట్టు పక్కల దేశాలకు పారిపోవలసి వచ్చింది. ఆ యుద్ధం ముగిసే సరికి చాలా భాగాన్ని ఇజ్రాయిల్ స్వాధీనం చేసుకుంది. వెస్ట్ బ్యాంక్ అని పిలిచే ప్రాంతాన్ని జోర్డాన్, గజా ఉన్న ప్రాంతాన్ని ఈజిప్ట్ ఆక్రమించుకున్నాయి. అంత చిన్న ప్రాంతాన్ని రెండు అరబ్ దేశాలు అప్పుడే పుట్టిన ఒక యూదు దేశం ఇజ్రాయిల్ పంచుకున్నాయి. అయితే ఆ తర్వాత కూడా ఘర్షణలు కొనసాగాయి.

1967 జరిగిన మరో యుద్ధంలో వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలేం ప్రాంతాలను కూడా ఇజ్రాయిల్ ఆక్రమించుకున్నాయి. అలా పాలస్తీనా అరబ్బులు పూర్తిగా ఆ ప్రాంతం నుంచి బయటకు రావాల్సి వచ్చింది. కొందరు పాలస్తీనా శరణార్థులు గాజ, వెస్ట్ బ్యాంక్ ప్రాంతాల్లో ఉంటున్నారు. మరికొందరు జోర్డాన్, ఈజిప్ట్, సిరియా, లెబనాన్. 2007 లో గజా ప్రాంతం మిలిటెంట్ గ్రూప్ హమాస్ ఆధీనంలోకి వెళ్లింది. ఇతర దేశాల్లో ఉంటున్న వారు తిరిగి రావడానికి ఇజ్రాయెల్ అనుమతించ లేదు. వాళ్లు స్వదేశానికి చేరుకుంటే అక్కడ వారి సంఖ్య పెరిగిపోయి యూద్ రాజ్యంగా ఉన్న తమ దేశ ఉనికి ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఇజ్రాయెల్ అంటోంది. వీరి మధ్య మరో సమస్య కూడా ఉంది. అదే జెరూసెలం నగరం… జెరూసలెం యూదులకు పవిత్ర నగరం. ముస్లీంలకు, క్రైస్తవులు కూడా దీనిని పవిత్రంగా భావిస్తారు. ఇజ్రాయిల్ జెరూసలేం ను తమ దేశ రాజధాని గా భావిస్తోంది. తమ దేశ రాజధానిగా తూర్పు జెరూసలేం ఉండాలని పాలస్తీనా కూడా కోరుకుంటుంది. గత 50 ఏళ్లలో వెస్ట్ బ్యాంక్ లో ఇజ్రాయిల్ అనేక కాలనీ లు ఏర్పాటు చేసింది.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఈ కాలనీలను అక్రమంగా భావిస్తుంది. కానీ ఈ వాదనను ఇజ్రాయిల్ తోసిపుచ్చుతోంది. ఇజ్రాయిల్ తమను వేధిస్తోందని, తమను బంధీలుగా చేసుకుంటుందని వెస్ట్ బ్యాంక్ లోని పాలస్తీనీయులు చెబుతున్నారు. ఇజ్రాయిల్ మాత్రం తమను తాము పాలస్తీనీయుల నుంచి రక్షించుకుంటామని చెబుతూ వస్తోంది. కొన్ని నెలల్లో మూడు పాలస్తీన కమ్యూనిటీలు బలవంతంగా తమ భూములను వదులుకోవాల్సి వచ్చిందని చెబుతున్నారు. యూదులు ఇప్పటికి పోరాడుతూనే ఉన్నారు.

ఇక గజా కోసం ఇజ్రాయిల్, హమాస్ చాలా సార్లు పోరాడయి. 2021 మే నెలలో ఇజ్రాయిల్ హమాస్ మధ్య యుద్ధం జరిగింది వీటి మధ్య సామాన్యులు కూడా చిక్కుకు పోతున్నారు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. గత 30 ఏళ్లలో శాంతి చర్చలు కూడా చాలానే జరిగాయి. కానీ ఇజ్రాయిల్, పాలస్తీనా, అరబ్బుల మధ్య తలెత్తిన పలు అంశాలను ఇప్పటి వరకు ఎలాంటి పరిష్కారం లభించలేదు. దీంట్లో మొదటిది ఇతర దేశాల్లో ఆశ్రయం పొందిన పాలస్తీనా శరణార్థుల పరిస్థితి ఏంటనేది కాగా…రెండవది వెస్ట్ బ్యాంక్ ఇజ్రాయిల్ లో నిర్మించిన యూదు సెటిల్మెంట్లను ఉంచుతారా.. తొలగిస్తారా.. మూడవది జెరుసలం రెండు పక్షాలు పంచుకుంటాయి లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇక అన్నింటికంటే ఇజ్రాయిల్ తో పాటు పాలస్తీనాను ఒక ప్రత్యేక దేశంగా చేస్తారా లేదా అని ఐక్యరాజ్యసమితిలోని సభ్య దేశాలు పాలస్తీనాకు ప్రత్యేక దేశంగా గుర్తింపు ఇచ్చాయి. కాని అమెరికా, జపాన్, జర్మనీ, ఆస్ట్రేలియా లాంటి దేశాలు ఇప్పటికీ ఇవ్వలేదు.

భారత్ తో సంబంధాలు

భారత్ ను 1988 లోనే పాలస్తీనా ను దేశంగా గుర్తించింది. భారత్ లో పాలస్తీనా రాయబారులు కూడా ఉంటున్నారు. 2017 లో పాలస్తీనా అథారిటీ చీప్ మహమ్మద్ అబ్బాస్ కూడా భారత్ కు వచ్చారు. 2018 లో ఇజ్రాయిల్ ప్రధాని కూడా నెతన్యాహూ భారత్ వచ్చారు. ఈ తరువాత భారత ప్రధాని పాలస్తీనాకు వెళ్లారు. అంతే కాదు అక్కడకు వెళ్లిన భారత తొలి ప్రధాన మంత్రి అయ్యారు. 2021 లో కూడా పాలస్తీనా తో తమ సంబంధాలు బలంగా ఉన్నాయని ఐక్యరాజ్య సెక్యూరిట కౌన్సిల్ లో భారత్ చెప్పింది. భారత్ పాలస్తీనాతో తమ బంధాన్ని ఎప్పుడూ తెంచుకోలేదు. అలాగే గత మూడు దశాబ్దాలు ఇజ్రాయిల్ తో తమ సంబంధాలను మెరుగుపరుచుకుంది. అందుకే భారత్ కు కూడా ఇది ఒక సంక్లిష్టమైన సమస్య…. హింస రెండు వైపుల నుంచి జరుగుతుంటే ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని నిర్ణయించడం మూడో పక్షానికి కష్టమవుతుంది. మిలిటెంట్ గ్రూప్ హమాస్ దాడులు చేసిన తీరు పాలకపక్షం బలహీనమయ్యేలా చేసింది. ఇలా చాలా కారణాలు పాలస్తీనా- ఇజ్రాయిల్ సమస్య ను మరింత జఠిలం చేస్తున్నాయి. ఈ సమస్యలు పరిష్కారం అయ్యి ఆ ప్రాంతంలో శాంతి నెలకొనాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు కానీ అది ఎప్పుడు సాధ్యమవుతుందో ఎవరికి తెలియడం లేదు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE