
ఉత్తర్‌ప్రదేశ్‌లోని జరిగిన హాథ్రస్లో భోలే బాబా సత్సంగ్ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటతో యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఘటనను ఇంకా కళ్ల ముందే కనిపిస్తోంది. ఈ ఘటన ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. అయితే ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినా కూడా ఇప్పటివరకు ఎలాంటి అరెస్టులు చోటు చేసుకోకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి.
మరోవైపు ఇంతటి పెను విషాదం తర్వాత నుంచి జగత్ గురు సాకార్ విశ్వహరి ఉరఫ్ భోలే బాబా ఆచూకీ మాత్రం ఇంకా తెలియలేదు. భోలే బాబా కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే మెయిన్‌పురిలో నిరామ్ కుటీర్ ఛారిటబుల్ ఆశ్రమంలో భోలే బాబా ఉన్నట్లు బుధవారం నుంచి వదంతులు వస్తుండటంతో.. పోలీసులు అక్కడ కూడాసెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. కానీ, భోలేబాబా ఆచూకీ మాత్రం దొరకలేదు.
నిరామ్ కుటీర్ ఛారిటబుల్ ఆశ్రమంలో 50 మంది వరకూ సేవాదార్లు ఉన్నారు భోలే బాబా మాత్రం కన్పించలేదని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు బుధవారం నుంచి బాబాను ఇక్కడ చూడలేదని స్థానికులు కూడా చెబుతున్నారని మెయిన్‌పురి డీఎస్పీ సునీల్ కుమార్ చెబుతున్నారు. అయితే జగత్ గురు సాకార్ విశ్వహరి రాజస్థాన్ వెళ్లిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇటు తొక్కిసలాట ఘటనపై భోలే బాబా తరఫు న్యాయవాది మాత్రం బుధవారం ఓ ప్రకటనను విడుదల చేశారు. జగత్ గురు సాకార్ విశ్వహరి ఆ వేదిక నుంచి వెళ్లిపోయిన చాలా సమయం తర్వాతే ఘటన జరిగిందని చెప్పిన లాయర్.. దాని వెనక అసాంఘిక శక్తుల కుట్ర ఉందని ఆరోపించారు. ప్రభుత్వం చేపట్టే దర్యాప్తునకు తన క్లైంట్జగత్ గురు సాకార్ విశ్వహరి సహకరిస్తారని చెప్పుకొచ్చారు.
అయితే, ప్రమాద సమయంలో జగత్ గురు సాకార్ విశ్వహరి వేదిక వద్దే ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. భక్తులను జగత్ గురు సాకార్ విశ్వహరి భద్రతా సిబ్బంది తోసివేయడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుని 121 మంది ప్రాణాలు కోల్పోయిన ఘనట జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మొత్తంగా ఇలాంటి బాబాలను నమ్మి మోసపోవద్దని అధికారులు,ప్రభుత్వాలు చెబుతున్నా మనుషులు మారడం లేదని..చివరకు ప్రాణాలు పోయే పరిస్థితిని కూడా తెచ్చుకుంటున్నారని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY