ఏపీ ఎన్నికల్లో వైసీపీ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. వైసీపీకి 40 శాతం ఓట్లు పడినప్పటికీ.. కేవలం 11 సీట్లు మాత్రమే దక్కాయి. అలాగే నాలుగు పార్లమెంట్ స్థానాల్లో గెలుపొందింది. వైసీపీ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. తన సొంత చెల్లెలు కూడా ప్రధాన కారణం. ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన షర్మిల.. ఎన్నికల్లో వైసీపీ ఓటమే లక్ష్యంగా పావులు కదిపారు. తన గెలుపు కంటే వైసీపీ ఎలాగైనా ఓడించాలని ప్రచారం చేశారు. వైసీపీ ప్రభుత్వ తప్పులను ఎండగడుతూ ముందుకెళ్లారు. ఒకరకంగా వైసీపీపై పెద్ద యుద్ధమే చేశారు. షర్మిల ఎఫెక్ట్ వల్ల వైసీపీకి కంచుకోటలాంటి 30 స్థానాల్లో ఓడిపోయింది. ఎన్నికల్లో తాను ఓడినప్పటికీ.. వైసీపీ ప్రభుత్వం అధికారం కోల్పోయిందన్న స్యాటిస్ ఫాక్షన్ షర్మిలకు ఉంది.
అయితే అంతటితో ఆగకుండా వైసీపీని నామరూపాలు లేకుండా చేసేందుకు షర్మిల ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీని పాతాలానికి తొక్కితేనే తిరిగి ఏపీలో కాంగ్రెస్ పుంజుకుంటుందనే ఆలోచనలో షర్మిల ఉన్నారట. అందుకే వైసీపీని మరింత చిత్తు చేయాలని వ్యూహాలు రచిస్తున్నారట. ప్రస్తుతం వైసీపీలో ఉన్న వారిలో దాదాపు కీలక నేతలంతా కాంగ్రెస్ నుంచి వచ్చిన వారే. ఇప్పుడు వారిని తిరిగి సొంత గూటికి రప్పించేందుకు షర్మిల ప్రయత్నాలు చేస్తున్నారట. ఇప్పటికే వైసీపీ కీలక నేతలకు రాహుల్ గాంధీ ఫోన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అటు షర్మిల కూడా వారితో టచ్‌లో ఉన్నారట. ఇదే కనుగ జరిగితే వైసీపీ పతనం అవ్వడం ఖాయమని అంటున్నారు విశ్లేషకులు. సీనియర్లంతా కాంగ్రెస్‌లోకి వెళ్లిపోతే.. పార్టీలో ఎవరూ మిగలరి.. మళ్లీ మొదటికి వస్తుందని అంటున్నారు.
అటు ఏపీలో కొలువుదీరిన టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి కూడా వైసీపీపై దండయాత్ర మొదలు పెట్టింది. ఇప్పటికే తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయాన్ని కూల్చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ కార్యాలయాల నిర్మాణాలను కూడా ఆపేసింది. అంతేకాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లతో పాటు కూటమి నేతలంతా వైసీపీ పాలనలో తప్పులను, అక్రమాలను వెతికి మరీ బహిర్గతం చేస్తున్నారు. రోజుకో నేత మీడియా ముందుకొచ్చి వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలను బయటపెడుతున్నారు. ఇది ముందు ముందు వైసీపీకి తీవ్రంగా డ్యామేజీ చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రజల్లో వైసీపీపై ఉన్న కాస్తో.. కూస్తో సింపతీ కూడా దూరం అయ్యే అవకాశం ఉంది.
ఇప్పటికే వైసీపీ సర్కార్ దోపిడి సర్కార్ అనే భావన ప్రజల్లోకి వెళ్లిపోయింది. ఈక్రమంలో పార్టీని కాపాడుకోవాలంటే.. తక్షణ కర్తవ్యంగా జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలనే దానిపై చర్చ మొదలయింది. ఈక్రమంలో కూటమి నేతలు చేస్తున్న ఆరోపణలపై వెంటనే గట్టిగా బదులివ్వాలని అంటున్నారు. వారి దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు తెరిచి ఉన్న అన్ని దారులనూ వెతికి ముందుకెళ్లాలని అంటున్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పటికి కంటే.. ఇప్పుడు మరింత దూకుడుతనం వ్యవహరించాలని చెబుతున్నారు. పార్టీ నేతలతో కూడా ఇప్పటికప్పుడు సమావేశమవుతూ వారికి దిశానిర్దేశం చేయాలని.. కూటమి నేతలు చేస్తున్న ఆరోపణలపై ఎలా స్పందించాలో వారికి జగన్ వివరించాలని అంటున్నారు. లేదంటే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY