మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరుతో అగ్రికల్చర్‌ యూనివర్సిటీ ప్రతిపాదన.. సానుకూలంగా స్పందించిన సీఎం జగన్

Rajamohan Reddy Asks AP CM Jagan To Set Up Agriculture University Name of Gouthtam Reddy, Rajamohan Reddy Asks AP CM Jagan To Set Up Agriculture University, Agriculture University, Agriculture University Name of Gouthtam Reddy, Rajamohan Reddy, Mekapati Rajamohan Reddy, Former Member of the Lok Sabha, AP CM Jagan, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, AP CM YS Jagan Mohan Reddy, Gouthtam Reddy Agriculture University, Rajamohan Reddy Asks AP CM Jagan To Set Up Gouthtam Reddy Agriculture University, AP, AP Latest News, AP Latest Updates, Mango News, Mango News Telugu, Mekapati Gouthtam Reddy,

మేకపాటి రాజమోహన్‌ రెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాల (మెరిట్స్‌) ను మేకపాటి గౌతమ్‌ రెడ్డి పేరుతో అగ్రికల్చర్‌ యూనివర్సిటీగా మార్చాలని సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని రాజమోహన్‌రెడ్డి కోరారు. బుధవారం ఇంజినీరింగ్‌ కళాశాలలో జరిగిన మంత్రి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలకు సీఎం వైఎస్‌ జగన్‌ హాజరైన విషయం తెలిసిందే. కాగా, ఈ సందర్భంగా సీఎంతో గౌతమ్ రెడ్డి తండ్రి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తన మనసులోని మాటను బయటపెట్టారు. ఉదయగిరిలో వందెకరాల్లో ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్‌ కాలేజీకి చెందిన సుమారు రూ.225 కోట్ల విలువైన ఆస్తులను తాను ప్రభుత్వానికి స్వచ్ఛందంగా అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీఎం జగన్‌ కి తెలిపారు.

అయితే, దీనిని తన పెద్ద కుమారుడు, మాజీ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి పేరు మీద ‘అగ్రికల్చర్‌ యూనివర్సిటీగా’ మార్చాలని కోరారు. ఉదయగిరి, ఆత్మకూరు వంటి మెట్ట ప్రాంతాల అభివృద్ధి కోసం తాను ఈ నిర్ణయానికి వచ్చినట్లు రాజమోహన్ రెడ్డి తెలిపారు. ఆయన ప్రతిపాదనకు స్పందించిన ముఖ్యమంత్రి త్వరలో జరిగనున్న అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై చర్చిస్తామని తెలిపారు. అలాగే, కాలేజీ పేరు మార్చడంతో పాటు అగ్రికల్చర్‌ యూనివర్సిటీగా మార్పు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని సీఎం జగన్ ఈ సందర్భంగా రాజమోహన్‌ రెడ్డికి హామీ ఇచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 11 =