పవన్ ఎఫెక్ట్.. పిఠాపురంలో రియల్‌ జోరు

Pawan Kalyan, Pithapuram, real estate sector, ap
Pawan Kalyan, Pithapuram, real estate sector, ap

పిఠాపురం.. ఈ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగిపోతోంది. జనసేనాని పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచి.. అందరి కళ్లు పిఠాపురంపైనే పడ్డాయి. సోషల్ మీడియాలో కూడా పిఠాపురం ట్రెండింగ్‌లో నిలించింది. ఇప్పుడు మరోసారి ఆ పేరు చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్‌తో పిఠాపురంలో రియల్ ఎస్టేట్‌కు రెక్కలొచ్చాయి. ముఖ్యంగా పవన్ అక్కడ ల్యాండ్ కొనుగోలు చేసి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుండడంతో.. రియల్ ఎస్టేల్ ఒక రేంజ్‌లో దూసుకెళ్తోంది. సముద్ర తీరంలో సాగుకు ఇబ్బందిగా మారిన మెట్ట ప్రాంతాలు కూడా ఎప్పుడు కోట్ల రూపాయలు పలుకుతున్నాయి. చాలా మంది ప్రముఖులు పిఠాపురంలో భూములు కొనుగోలు చేసేందుకు ముందుకు రావడంతో.. అక్కడ కాసుల వర్షం కురుస్తోంది.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. తాను గెలుపొందితే పిఠాపురం రూపు రేఖలు మారుస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. అన్ని రంగాల్లో పిఠాపురాన్ని అభివృద్ధి చేసి దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. ఇప్పుడు అధికారంలోకి రావడంతో పిఠాపురంపై పవన్ ఫోకస్ పెట్టారు. ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కార్యాచర మొదలు పెట్టారు. పిఠాపురాన్ని డెవలప్ చేసేందుకు ఉన్న అన్ని మార్గాను అన్వేషిస్తున్నారు. అసలు పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారని తెలిసినప్పటి నుంచే ఆ నియోజకవర్గ రూపురేఖలు క్రమక్రమంగా మారుతూ వస్తున్నాయి. ఇప్పుడు అక్కడ రియల్ ఎస్టేట్ రంగం కూడా ఒక్కసారిగా పుంజుకుంది.

ఇటీవల పవన్ కళ్యాణ్ పిఠాపురం మండలం భోగాపురం, ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో 3.52 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. తన నివాసం, క్యాంపు కార్యాలయ నిర్మాణం కోసం ఆ స్థలాన్ని ఎంపిక చేసుకున్నారు. ఇప్పటిక నిర్మాణ పనులు మొదలయ్యాయి. త్వరలోనే పవన్ నివాసం పూర్తి కానుంది. అయితే పవన్ అక్కడ ఇళ్లు కట్టుకుంటుండడంతో చాలా మంది ప్రముఖులు పిఠాపురంలో భూములు కొనుగోలు చేసేందుకు ముందుకెస్తున్నారు. కోట్లు పోసి భూములను కొంటున్నారు. దీంతో ఒక్కసారిగా పిఠాపురంలో భూములకు రెక్కలొచ్చాయి. ఒకప్పుడు ఎకరం భూమి ఇరవై నుంచి ముప్పై లక్షలు పలికేది. కానీ ఇప్పుడు ఎనభై నుంచి కోటి రూపాయల వరకు పలుకుతోందట. అంతేకాకుండా సాగు నీరు ఉండి.. హైవేల పక్కన ఉన్న భూములు రెండు నుంచి మూడు కోట్లు పలుకుతున్నాయట.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE