చంద్రబాబు ఎదుట బాలకృష్ణ బిగ్ డిమాండ్.. నెరవేరేనా?

MLA Balakrishna Announced That Hindupuram Will Be Made A District,MLA Balakrishna,Balakrishna Announced That Hindupuram Will Be Made A District,Hindupuram Will Be Made A District,Hindupuram,Balakrishna, Chandrababu Naidu,AP,Lok Sabha Elections, AP Live Updates, AP Politics, Political News, Mango News, Mango News Telugu
chandrababu naidu, hindupur, mla balakrishna, ap

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు తీవ్ర వివాదాస్పదమయిన విషయం తెలిసిందే. గత వైసీపీ ప్రభుత్వం 13గా ఉన్న జిల్లాలను 26కి పెంచింది. దీంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదురయింది. పలువురు నిపణులు.. ప్రజల సలహాలు, సూచనలు పక్కన పెట్టి వైసీపీ ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. దీంతో కొత్త జిల్లాల ఏర్పాటు అంశం అప్పట్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయింది. వివాదానికి దారి తీసింది. ఈ అంశాన్ని ఎవరు తవ్వినా ఇప్పుడు మరోసారి వివాదం తలెత్తే అవకాశం ఉంది. ఇదే సమయంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంచలన ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎదుట పెద్ద డిమాండే పెట్టారు. ఇప్పుడు ఆ డిమాండ్‌ను చంద్రబాబు నెరవేరుస్తారా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది.

హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గంగా ఉంది. కానీ వైసీపీ ప్రభుత్వం సత్యసాయి జిల్లాగా చస్తూ.. పుట్టపర్తిని జిల్లా కేంద్రం చేసింది. అయితే బాలకృష్ణ సత్యసాయి జిల్లాను హిందూపురం జిల్లాగా మారుస్తానని ఇటీవల ప్రకటన చేశారు. అది నెరవేర్చడం సాధ్యమేనా కాదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశం అయింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో కొత్త జిల్లాలు.. వాటి కేంద్రాలకు సంభంధించి పెద్ద ఎత్తున వివాదం తలెత్తింది. నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గంగా ఉంటే.. భీమవరంను జిల్లా కేంద్రంగా వైసీపీ ప్రభుత్వం చేసింది. అన్నమయ్య జిల్లాకు కూడా రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయకుండా రాయచోటిని కేంద్రంగా చేసింది. ఇలా చాలా విషయాల్లో వివాదం తలెత్తింది.

అయితే ఇంతటి వివాదాస్పదమయిన విషయంలో బాలకృష్ణ వేలు పెట్టి సంచలన ప్రకటన చేయడం సంచనలంగా మారింది. ఇది కూటమి ప్రభుత్వానికి తలనొప్పిగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఒక్కసారి రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల పేరు.. కేంద్రాల మార్పు అంటూ ప్రచారం జరిగితే అది ప్రభుత్వానికి అది సమస్యగా మారుతుందని చెబుతున్నారు. ఇదే విధంగా గతంలో వివాదాస్పదంగా మారిన జిల్లాల నుంచి కూడా డిమాండ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సమయంలో బాలయ్య ఆ డిమాండ్‌ను చంద్రబాబు ముందు పెట్టి పెద్ద పని పెట్టారని అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. చూడాలి మరి బాలయ్య డిమాండ్ నెరవేరుతుందా? లేదా? అన్నది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ