ఏపీలో రాజకీయాల్లో శ్వేతపత్రాల విడుదల ఇప్పుడు పొలిటికల్ హీట్ ను రాజేస్తోంది. ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో 8 రంగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో గత ఐదేళ్ళ కాలంలో ఏం జరిగింది…? వైసీపీ హయాంలో జరిగిన అవకతవకలపై వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు సీఎం చంద్రబాబు. అసలు రాష్ట్రంలో ఉన్న నిధులు.. ప్రాజెక్టుల పనితీరును ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపించిన తర్వాతే పాలన మొదలు పెట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నారు. గడిచిన ఐదేళ్లలో వైసీపీ నేతలు దోచుకున్న భూములు , దాచుకున్న డబ్బు , కొట్టేసిన చెట్లు , కాల్చేసిన విద్యుత్తూ వంటివి బయట పెడుతూ వస్తున్నారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి, విద్యుత్ రంగంలోని సంక్షోభం, భూ దందాలు, సహజ వనరుల దోపిడి ఇలా వరుసగా ఇప్పటి వరకు ఐదు శ్వేతపత్రాలు విడుదల చేశారు.
తొలుత ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేశారు. ప్రాజెక్టుపై వాస్తవ పరిస్థితులను సీఎం చంద్రబాబు నాయుడు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా శ్వేతపత్రం విడుదల చేశారు. మరోవైపు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అంశం అమరావతి రాజధాని. ఈ అమరావతి రాజధానిపైనా శ్వేతపత్రం విడుదల చేసిన సంగతి తెలిసిందే. అమరావతి నిర్మాణంలో కేంద్ర సహకారం, టీడీపీ హయాంలో జరిగిన పనులు, ప్రస్తుతం అమరావతిలో జరుగుతున్న తీరు… మూడు రాజధానులు ఇలా ప్రతీ అంశాన్ని శ్వేతపత్రంలో పొందుపరుస్తూ ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు వివరించిన సంగతి తెలిసిందే. అనంతరం విద్యుత్ రంగంపై శ్వేత పత్రం విడుదల చేసిన సంగతి తెలిసిందే. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని భ్రష్టుపట్టించింది అని… మిగులు విద్యుత్ రాష్ట్రాన్ని కాస్తా కరెంట్ కొనుగోలు చేసే స్థితికి దిగజార్చిందని సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రంలో జరిగిన భూములు, ఇసుక, సహజ వనరుల దోపిడీపై శ్వేతపత్రం విడుదల చేశారు.
ఇలా చంద్రబాబు శ్వేతపత్రాల ద్వారా తమ గుట్టును బయటపెడుతుండడంతో వైసీపీ నాయకుల్లో భయం , ఆందోళన మొదలైందట. అధికారం తమ చేతిలో ఉంది..వచ్చేసారి కూడా మనదే అధికారం అని భావించిన కొందరు వైసీపీ నాయకులు ఇష్టారాజ్యంగా దోచుకున్నారు. ప్రజల సొమ్మును వారి జేబుల్లో వేసుకున్నారు. అభివృద్ధిని పక్కన పెట్టి వారి అభివృద్ధిని పెంచుకోవడం చేసారు. ఇక ఇప్పుడు అధికారం కూటమి చేతుల్లోకి వెళ్లడం తో అన్ని బయటకు వస్తున్నాయి. ఇందులో నుండి బయట పడాలంటే అధికార పార్టీ లోకి వెళ్ళాలి కానీ టిడిపి , అటు జనసేన రెండు కూడా ఎట్టి పరిస్థితుల్లో తమను చేర్చుకోరు..ఇక ఉన్నది ఒక బీజేపీ మాత్రమే. బిజెపి కి రాష్ట్రంలో పెద్దగా నాయకులు లేరు..సో ఆ పార్టీ కచ్చితంగా చేర్చుకుంటుంది. బిజెపి ఎలాగూ కూటమిలో భాగమే కావడంతో వారి జాతకాలు బయట పడే ఛాన్స్ లేదు..సో బిజెపి పార్టీనే తమను ఆదుకునేది అని కొందరు వైసీపీ నాయకులు భావిస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి బుగ్గన ఆ పనిలో నిమగ్నమయ్యారని తెలుస్తుంది. ఇదే బాటలో మరికొందరు వైసీపీ నాయకులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE