తెలంగాణ‌ సీఎస్ సోమేశ్ కుమార్ కేటాయింపు రద్దు చేసిన హైకోర్టు, ఏపీకి వెళ్లాలని కీలక ఆదేశం

TS High Court Cancelled The Allocation of Chief Secretary Somesh Kumar Today Orders For Go To AP,TS High Court,Chief Secretary Somesh Kumar,Somesh Kumar Orders For Go To AP,Mango News,Mango News Telugu,Telangana Chief Secretary Somesh Kumar,Sri Somesh Kumar The Hon'Ble Chief Secretary,Somesh Kumar Wikipedia,Somesh Kumar Chief Secretary Telangana Wikipedia,Somesh Kumar Chief Secretary Address,Head Of Chief Secretary,Chief Secretary Telangana Office Address,Chief Secretary Or Principal Secretary

తెలంగాణ‌ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్‌ కుమార్‌ కేటాయింపును రద్దు చేసింది. అంతేకాకుండా ఆయనను ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం హైకోర్టు సీజే జ‌స్టిస్ ఉజ్జ‌ల్ భూయాన్ బెంచ్ కీలక తీర్పు ప్రకటించింది. 2019 డిసెంబ‌ర్ నుంచి తెలంగాణ సీఎస్‌గా సోమేశ్ కుమార్ కొన‌సాగుతున్న విషయం తెలిసిందే. కాగా రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో కేంద్ర ప్రభుత్వం సోమేశ్ కుమార్‌ను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించింది. అయితే కేంద్రం నిర్ణయంపై సోమేశ్ కుమార్ కేంద్ర ప‌రిపాల‌న ట్రిబ్యున‌ల్‌ (క్యాట్‌)ను ఆశ్ర‌యించారు. ఈ నేపథ్యంలో సోమేశ్ కుమార్ విజ్ఞప్తి మేరకు క్యాట్‌ కేంద్రం నిర్ణయాన్ని నిలిపివేసిన‌ క్యాట్‌, ఆయన తెలంగాణ‌ రాష్ట్రంలోనే కొనసాగేందుకు అనుమతిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

క్యాట్ ఉత్త‌ర్వుల‌తో అప్పటినుంచీ సోమేశ్ కుమార్ తెలంగాణ‌ రాష్ట్రంలో కొన‌సాగుతున్నారు. దీంతో కేంద్రం క్యాట్ ఉత్త‌ర్వులు కొట్టేయాల‌ని కోరుతూ 2017వ సంవత్సరంలో హైకోర్టుకు వెళ్ళింది. ఈ క్ర‌మంలో దీనిపై విచారణ జరిపిన సీజే ఉజ్జ‌ల్ భూయాన్ ధ‌ర్మాస‌నం నేడు క్యాట్ ఉత్తర్వులు కొట్టివేస్తూ తుది తీర్పు వెల్లడించింది. క్యాట్ ఉత్తర్వులు కొట్టివేసిన హైకోర్టు, తెలంగాణకు సోమేశ్‌ కుమార్‌ కేడర్ కేటాయింపుని రద్దు చేయడంతో పాటు ఆయన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి వెళ్లాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది. అయితే సోమేష్ కుమార్ తరపు న్యాయవాది అభ్యర్థన మేరకు తీర్పు అమలును 3 వారాలు పాటు నిలిపివేస్తూ హైకోర్టు ధర్మాసనం నిర్ణయం తీసుకుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + nine =