రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది.. వైసీపీ అధినేత‌ జగ‌న్ పోస్ట్

Former Chief Minister Jagan Mohan Reddy Posted On Social Media That Demon Rule Is Continuing In Andhra Pradesh,Demon Rule Is Continuing In Andhra Pradesh,Former Chief Minister Jagan Mohan Reddy Posted On Social Media,Social Media,Andhra Pradesh,Demon Rule,Jagan Mohan Reddy ,Former Chief Minister Jagan Mohan Reddy,TDP,YCP, YS Jagan,AP,Lok Sabha Elections, AP Live Updates, AP Politics, Political News, Mango News, Mango News Telugu, ,
Former Chief Minister Jagan Mohan Reddy, social media, Andhra Pradesh, tdp

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన ద‌గ్గ‌ర నుంచి రాష్ట్రంలో ఆగ‌డాలు ఎక్కువ‌య్యాయ‌ని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు జగ‌న్ ఆరోపించారు. తాజాగా గుంటూరు జిల్లా వినుకొండ‌లో జ‌రిగిన హ‌త్య‌పై ఆయ‌న ఎక్స్ ద్వారా స్పందించారు. రాష్ట్రంలో రాక్ష‌స పాల‌న కొన‌సాగుతుందని, లా అండ్ ఆర్డ‌ర్ అదుపు త‌ప్పింద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది. లా అండ్‌ ఆర్డర్‌ అన్నది ఎక్కడా కనిపించడంలేదు. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. వైయస్సార్‌సీపీని అణగదొక్కాలన్న కోణంలో ఈ దారుణాలకు పాల్పడుతున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చి నెలన్నర రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్‌ అంటే హత్యలు, అత్యాచారాలు, రాజకీయ కక్షలతో చేస్తున్న దాడులు, విధ్వంసాలకు చిరునామాగా మారిపోయింది. నిన్నటి వినుకొండ హత్య ఘటన దీనికి పరాకాష్ట. నడిరోడ్డుపై జరిగిన ఈ దారుణ కాండ ప్రభుత్వానికి సిగ్గుచేటు.  ముఖ్యమంత్రి సహా బాధ్యతతో వ్యవహరించాల్సిన వ్యక్తులు రాజకీయ దురుద్దేశాలతో వెనకుండి ఇలాంటి దారుణాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ, పోలీసు సహా యంత్రాంగాలన్నింటినీ నిర్వీర్యం చేశారని.. దీంతో నేరగాళ్లు, హంతకులు చెలరేగిపోతున్నారన్నారు. అధికారం శాశ్వతం కాదని, హింసాత్మక విధానాలు వీడాలని చంద్రబాబును గట్టిగా హెచ్చరిస్తున్నానని రాసుకొచ్చారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో ప్రత్యేక విచారణ జరగాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతల పరిస్థితులపై దృష్టిపెట్టాలని  ప్రధానమంత్రి మోదీగారికి, హోంమంత్రి అమిత్‌షాగారికి విజ్ఞ‌ప్తిచేస్తున్నాను. వైయస్సార్‌సీపీ కార్యకర్తలెవ్వరూ అధైర్యపడొద్దని అన్నిరకాలుగా అండగా ఉంటామని భరోసా ఇస్తున్నాను. వినుకొండలో టీడీపీ కార్యకర్తల చేతిలో హత్యకు గురైన రషీద్‌ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను అని జగన్ ట్విట్టర్ లో రాసుకొచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF