ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వంపై ధర్నాకు సిద్ధమయ్యారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ మేరకు ఢిల్లీలో ధర్నాకు దిగారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయని కొంతకాలంగా జగన్ ఆరోపిస్తున్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీలో 35 రాజకీయ హత్యలు జరిగాయని గవర్నర్‌కు జగన్ ఫిర్యాదు చేశారు. ఇప్పుడు తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి జగన్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగారు. అయితే ధర్నాకు వెళ్లే ముందు జగన్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత అయిదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు తాము ఎన్నడు కూడా హింసారాజకీయాలను ప్రోత్సహించలేదని జగన్ వ్యాఖ్యానించారు.
ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతూందని జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు కూడా కాకముందే 35 రాజకీయ హత్యలు జరిగాయని ఆరోపించారు. అంతేకాకుండా వందల ఇళ్లను ధ్వంసం చేశారని.. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇప్పటి వరకు తమ పార్టీకి చెందిన వెయ్యి మందిపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. గట్టని వారి పంటలను కూడా సర్వనాశనం చేశారని మండిపడ్డారు. ముఖ్యంగా వైసీపీ నేతలను టార్గెట్‌గా చేసుకొని దాడులకు పాల్పడుతున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రి నారా లోకేష్ పదే పదే ప్రస్తావించే రెడ్ బుక్ గురించి కూడా జగన్ స్పందించారు. లోకేష్ రెడ్ బుక్ పేరుతో హోర్డింగులు పెట్టారని.. తనకు నచ్చనివారిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా నాశనం చేశారని.. అసలు ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు. అందుకే ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతున్నానని.. ఇటీవల కూడా ఇదే కోరానని జగన్ స్పష్టం చేశారు. ఇకపోతే ఇటీవల ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ ఎదుట వైసీపీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. హత్యా రాజకీయాలు ఆపాలి.. సేవ్ డెమెక్రసీ ఇన్ ఏపీ అంటూ ప్లకార్డులను ప్రదర్శించి నిరసన తెలియజేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE