జులై 26 వ తేదీ నుంచి పారిస్ 2024 ఒలింపిక్ క్రీడలు ప్రారంభం అవుతున్నాయి. ఈ సందర్భంగా రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నీతా అంబానీ.. ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ మెంబర్‌గా భారత్ నుంచి ఏకగ్రీవంగా తిరిగి ఎన్నికయ్యారని ఐఓసీ ఒక ప్రకటన ద్వారా తెలిపింది. పారిస్‌లో రేపటి నుంచి జరుగుతున్న 142వ IOC సెషన్‌లో భారత్ నుంచి 100% ఓట్లతో నీతా అంబానీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యునిగా తిరిగి ఎన్నికైనందుకు తాను ఎంతో గౌరవంగా భావిస్తున్నానని నీతా అంబానీ అన్నారు. ప్రెసిడెంట్ బాచ్, IOCలోని తన సహోద్యోగులందరూ తనపై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ రీ-ఎలక్షన్ కేవలం వ్యక్తిగత మైలురాయి మాత్రమే కాదన్న ఆమె.. ప్రపంచ క్రీడా రంగంలో భారత్‌కు పెరుగుతున్న ఆదరణను ఇది గుర్తు చేస్తుందని చెప్పారు. ఈ ఆనంద క్షణాలను దేశంలోని ప్రజలందరితో పంచుకుంటున్నారని.. భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నానని అన్నారు.
2016లో రియో డి జనీరో ఒలింపిక్స్‌లో ప్రతిష్టాత్మక సంస్థలో చేరేందుకు నీతా అంబానీ తొలిసారిగా నియమితులయ్యారు. అప్పటి నుంచి IOC మెంబర్‌గా చేరిన భారతదేశపు మొదటి మహిళగా నీతా అంబానీ తన వంతు ఎంతగానో కృషి చేశారు. అదే సమయంలో తనవంతు దేశంలో క్రీడా స్పూర్తిని పెంచుతూ, ఒలింపిక్స్ దృష్టిని మరల్చారు. 2023 అక్టోబర్‌లో 40 ఏళ్ల తర్వాత ముంబైలో మొదటి ఐఓసీ సెషన్‌ను ఈ మధ్యనే నిర్వహించారు. రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలిగా ఉన్న నీతా అంబానీ మిలియన్ల కొద్దీ భారతీయులకు ఆర్థిక వనరులు సమకూర్చడంతో పాటు, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం స్పోర్ట్స్, ఎడ్యుకేషన్, హెల్త్, ఆర్ట్, సంస్కృతి వంటి వివిధ కార్యక్రమాలను స్వయంగా నిర్వహిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY