అన్నదమ్ములు ఉన్నవాళ్లు ఏడాదికొకసారి వచ్చే రాఖీ పండుగ కోసం ఏడాదంతా ఎదురుచూస్తూ ఉంటారు. చివరకు రాఖీ పండుగ రాగానే.. అన్నదమ్ములు సంతోషంగా, ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటూ ప్రేమతో రాఖీ కడతారు. అక్కచెల్లెళ్లతో రాఖీ కట్టించుకున్న సోదరులు తమకు తోచిన బహుమతిని ఇచ్చి వారిని ఆనందపరుస్తూ ఉంటారు. ఇదే ఎన్నో ఏళ్లుగా ఒక ఆచారంగా కొనసాగుతూ వస్తుంది.
అన్నాచెల్లెళ్లలా జన్మించడం పూర్వజన్మ పుణ్యం అనుకుంటూ ఉంటారు చాలామంది. అన్నయ్య చూసే అనురాగం.. అమ్మానాన్నలా ఆదరించే అన్నపై సోదరి చూపించే అభిమానానికి నిదర్శనంగా రాఖీ పండుగ అని చెబుతారు. ఎల్లప్పుడూ అన్ని కష్టసుఖాలలో సోదరీమణులకు తోడుగా ఉంటానని ఈ రక్షాబంధన్ సాక్షిగా వాగ్దానం చేస్తూ ప్రతి ఏటా ఆగస్టు నెలలో అక్కచెల్లెల్లందరూ తమ అన్నదమ్ములకు రాఖీ కడతారు.
ఈ రాఖీ పండగను శ్రావణ పౌర్ణమి రోజు జరుపుకొంటారు. ఈస్ట్ నుంచి వెస్ట్ వరకూ దీనిని ఓ పండుగలా జరుపుకొంటారు. ఆగస్ట్ 19 సోమవారం రోజు వస్తున్న రక్షాబంధన్ రోజు.. ఈ పవిత్రమైన రాఖీని అన్నదమ్ములకు కట్టడానికి ఈ ఏడాది కొన్నికొన్ని సమయాలు మాత్రమే అనుగుణంగా ఉన్నాయని పండితులు అంటున్నారు. తాము చెప్పిన సమయాల్లో అన్నదమ్ములకు రాఖీ కడితే మంచి జరుగుతుందని..వేరే సమయాలలో కడితే ఆ ఏడాదంతా కీడు జరిగే అవకాశాలున్నాయంటాయని అంటున్నారు.
రక్షా బంధన్ 2024 శుభ ముహూర్తాలు
ఆగస్టు 19.. 2024న తెల్లవారుజామున 03:04నిమిషాలు, ఆగస్టు 19.. ఉదయం 09:51 నుంచి 10:53 వరకు,ఆగస్టు 19.. ఉదయం 10:53 నుంచి మధ్యాహ్నం 12:37 వరకు, అలాగే మధ్యాహ్నం 1:30 నుంచి రాత్రి 09:08 వరకు, మధ్యాహ్నం 01:43 నుంచి సాయంత్రం 04:20 వరకు, సాయంత్రం 06:56 నుంచి రాత్రి 09:08 వరకు సోదరీమణులు సోదరులకు రాఖీ కట్టడానికి మంచి ముహూర్తాలు ఉన్నట్లు పండితులు చెబుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE