ICC మహిళల ప్రపంచ కప్: వెస్టిండీస్‌పై 155 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం

ICC Women ODI World Cup 2022 India Beats West Indies by 155 Runs, ICC Women ODI World Cup 2022, India Beats West Indies by 155 Runs, India Beats WI By 155 Runs, ICC Women’s World Cup, 2022 ICC Women’s ODI World Cup, Women’s ODI World Cup, ICC Women’s World Cup-2022 India Beats West Indies, International Cricket Council, International Cricket Council Women’s World Cup, West Indies, India, ODI World Cup, ODI World Cup Latest Updates, Women’s ODI World Cup Latest News, Women’s ODI World Cup Latest Updates, Women’s ODI World Cup Live Updates, India Beats West Indies By 155 Runs, Women’s ODI World Cup 2022, 2022 Women’s ODI World Cup, India Won By 155 Runs, Mango News, Mango News Telugu,

హామిల్టన్ వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఈరోజు (శనివారం) వెస్టిండీస్ మరియు భారతదేశం మధ్య కీలక మ్యాచ్ జరిగింది. సెడాన్ పార్క్‌లో జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ 155 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించి రెండో విజయాన్ని నమోదు చేసింది. ముందు బ్యాటింగ్ చేసిన భారత్.. ఓపెనర్ స్మృతి మంధాన (119 బంతుల్లో 123 పరుగులు), హర్మన్‌ప్రీత్ కౌర్ (107 బంతుల్లో 109 పరుగులు) అద్భుత సెంచరీలతో చెలరేగడంతో భారీస్కోరు సాధించింది. వీరిద్దరి అద్భుతమైన భాగస్వామ్యంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 317 పరుగులు చేసింది. మిగిలిన వారిలో యస్తికా భాటియా 31 పరుగులు చేసింది.

అనంతరం 318 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నంలో వెస్టిండీస్ 162 పరుగులకు ఆలౌట్ అయింది. విండీస్‌ బ్యాటర్స్ లో ఓపెనర్లు మాత్రమే రాణించారు. వీరిద్దరూ మెరుపువేగంతో ఆడారు. డియాండ్ర డాటిన్‌ 36బంతుల్లోనే 50 పరుగులు, మరో ఓపెనర్‌ హేలీ 32 పరుగులు చేశారు. వీరి ధాటికి వెస్టిండీస్‌ పది ఓవర్లలో 81 పరుగులు సాధించింది. అయితే, స్నేహ్ రాణా, మేఘనా సింగ్ వీరిద్దరిని అవుట్ చేసి భారత శిబిరంలో జోష్ నింపారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన విండీస్ ప్లేయర్స్ ఎవరూ ఎక్కువసేపు క్రీజులో నిలువలేకపోయారు. రాణా 3, మేఘన 2 కీలక వికెట్లు తీసి విండీస్ వెన్ను విరిచారు.

ఈ మ్యాచ్‌లో భారత సీనియర్ బౌలర్ ఝులన్ గోస్వామి వరల్డ్ రికార్డ్ సృష్టించింది. గురువారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 39 వికెట్లతో ఆస్ట్రేలియన్ బౌలర్ లిన్ ఫుల్‌స్టన్ తో స్కోరును సమం చేసిన గోస్వామి, నేటి మ్యాచ్‌లో మరో వికెట్ తీయడం ద్వారా ప్రపంచ రికార్డు సాధించింది. అనిసా మొహమ్మద్ వికెట్‌ సాధించటం ద్వారా మహిళల ప్రపంచ కప్‌లలో 40 వికెట్లు తీసిన తొలి బౌలర్ గా సృష్టించింది. కాగా, గోస్వామి ఇప్పటివరకు 198 మ్యాచ్‌లలో 249 వికెట్లతో అన్ని మహిళల వన్డే ఇంటర్నేషనల్స్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా కొనసాగుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + eight =