ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. అయితే 2024లో పారిస్‌లో జరిగే ఒలింపిక్స్‌లో పాల్గొనే మొత్తం 10,714 మంది అథ్లెట్లలో కేవలం 117 మంది మాత్రమే భారతీయులు కావడం బాధాకరమైన విషయం. నేడు, భారతదేశం ప్రపంచ స్థాయిలో అనేక విషయాలలో అన్ని దేశాలకు మార్గదర్శిగా ముందడుగు వేస్తోంది. అయితే, ఒలింపిక్స్ క్రీడలలో మాత్రమే చాలా వెనుకబడి ఉంది. అమెరికా, చైనాలను ఆర్థికంగా సవాలు చేసే సత్తా భారత్‌కు ఉన్నప్పటికీ ఒలింపిక్స్‌లో మాత్రం వాటితో పోల్చుకునే పరిస్థితిలో లేదు.
ఒలింపిక్స్‌లో భారత్‌కు 10 స్వర్ణాలు మాత్రమే వచ్చాయి. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో, గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో భారతదేశానికి మొట్టమొదటి స్వర్ణం సాధించాడు. పురుషుల జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించాడు. ఒలింపిక్స్ చరిత్రలో భారత్‌కు ఇది రెండో వ్యక్తిగత స్వర్ణం. అంతకుముందు 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో షూటర్ అభినవ్ బింద్రా 10మీ. ఎయిర్ రైఫిల్ పోటీలో స్వర్ణంపై గురిపెట్టి సాధించాడు. వందేళ్ల ఒలింపిక్స్ చరిత్రలో భారత్ 10 స్వర్ణాలను మాత్రమే గెలుచుకుంది, ఇందులో ఫీల్డ్ హాకీ లో భారత్ సాధించిన 8 స్వర్ణాలతో పాటు 2 వ్యక్తిగత స్వర్ణాలు ఉన్నాయి.
ఆల్ టైమ్ మెడల్ లిస్ట్ ఒలింపిక్స్ లో భారత్ దయనీయ స్థితికి అద్దం పడుతోంది. శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన భారత్‌కు స్వాతంత్య్రానికి ముందు, స్వాతంత్య్రానంతరం ఒలింపిక్స్‌లో కేవలం 35 పతకాలు మాత్రమే వచ్చాయి. అమెరికా, చైనాలు ప్రతిసారీ వందల సంఖ్యలో పతకాలు సాధిస్తుండగా, భారత్ మాత్రం కొన్న పతకాలతోనే సరిపెట్టుకుంటోంది. భారతదేశంలో ప్రతిభకు కొరత లేదు.. అయితే ఆ ప్రతిభకు ప్రోత్సాహకం అందించే వాళ్లు కరువయ్యారు. ప్రభుత్వాలు, అధికారులు మాత్రం ఇప్పటికి క్రీడలను ప్రోత్సహించడం లేదు. తాజాగా బడ్జెట్ లో క్రీడలకు కేటాయించిన మొత్తం రూ.3442 కోట్లు మాత్రమే… భారత్‌లో క్రీడలకు ప్రత్యేక బడ్జెట్ రూపొందిస్తేనే ఒలింపిక్స్‌లో పతకాలు సాధించే క్రీడాకారులను తయారు చేయడం సాధ్యమవుతుంది. ప్రభుత్వాలు ఇప్పటికైన మేల్కొని ఆ దిశగా చర్యలు చేపడితేనే విశ్వవేదికపై భారత్ సత్తా చాటి మరిన్ని పతకాలు సాధించే అవకాశముంటుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ