పూజా ఖేడ్కర్, నీట్ వివాదం మధ్య.. ఇప్పుడు తన పరీక్షా విధానంలో పెద్ద మార్పు చేయబోతోంది. పరీక్షల్లో చీటింగ్‌లు, అభ్యర్థులు చేసే మోసాలను, ఈ కేసులను నివారించడానికి ఆధార్ ఆధారిత ఫింగర్ ప్రింట్స్, ఫేస్ రిగగ్నైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన కెమెరాలు వంటి లేటెస్ట్ టెక్నాలజీ వంటివాటిని యూపీఎస్సీ పరిశీలిస్తోంది.
మహారాష్ట్ర కేడర్ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ ఇలాంటి కారణాలతోనే ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నారు . శిక్షణ సమయంలోనే కారు, వసతి, ప్రత్యేక గదిని డిమాండ్ చేయడం ద్వారా ఆమె విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత నకిలీ సర్టిఫికెట్లను సబ్మిట్ చేసినట్లు తేలింది. అలాగే కోట్లాది రూపాయల ఆస్తులున్నా కూడా వెనుకబడిన తరగతుల నాన్ క్రీమీలేయర్ కేటగిరీలో ఎగ్జామ్‌కు హాజరయ్యారు. అయితే దీనిపై కొంత విచారణ జరిపి ఆమె శిక్షణ రద్దు చేసారు. అయితే భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా యూపీఎస్సీ ముందస్తు చర్యలు తీసుకుంటోంది.
కాగా ఇప్పటికే అందిన నివేదికలు చెబుతున్న దాని ప్రకారం.. యూపీఎస్సీ నిర్వహించే పరీక్షలలో సాంకేతిక సేవలను అందించడానికి PSU ల నుంచి బిడ్లను కూడా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో కమిషన్ జారీ చేసిన టెండర్లో ఆధార్ ఆధారిత ఫింగర్ ప్రింట్స్ ప్రామాణీకరణ లేదా డిజిటల్ వేలిముద్ర క్యాప్చర్, అభ్యర్థుల ఫేస్ రిగగ్నైజేషన్, ఈ-అడ్మిట్ కార్డ్‌ల క్యూఆర్ కోడ్ స్కానింగ్, ఏఐ ఆధారిత సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణ ఉన్నట్లు సమాచారం. ఇది కాకుండా.. బిడ్ లను పొందిన సర్వీస్ ప్రొవైడర్ తగిన మానవ వనరులను కూడా అందించాలని షరతులు ఉన్నాయి.
పరీక్ష షెడ్యూల్, పరీక్షా కేంద్రాల లిస్ట్, అభ్యర్థుల సంఖ్య వంటి సమాచారాన్ని ఎగ్జామ్‌కు 2 లేదా 3 వారాల ముందు సర్వీస్ ప్రొవైడర్లకు తాము అందజేస్తామని, దాంతో ప్రిపరేషన్‌ను పూర్తి చేయాలని యూపీఎస్సీ తెలిపింది. ఇది ఫింగర్ ప్రింట్ ప్రమాణీకరణ, ఫేస్ రిగగ్నైజేషన్ కోసం పరీక్షకు 7 రోజుల ముందు అభ్యర్థుల వివరాలను అంటే వారి పేరు, రోల్ నంబర్, ఫోటో మొదలైనవి కూడా అందిస్తుంది. చీటింగ్, ఫోర్జరీ, వివిధ మోస మార్గాలను నిరోధించడానికి ఈ చర్యలు తీసుకుంటున్నట్లు యూపీఎస్సీ తెలిపింది.
అక్టోబర్ 1, 1926న యూపీఎస్సీ ఢిల్లీలో ప్రధాన కార్యాలయంతో స్థాపించబడింది. ఇది ఇండియా కేంద్ర ఏజెన్సీ, రాజ్యాంగ హోదాను కూడా పొందింది. ఇది గవర్నమెంట్ సర్వీసుల్లో రిక్రూట్మెంట్ కోసం సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ వంటి పరీక్షలను నిర్వహిస్తుంది. యూపీఎస్సీ ప్రతి ఇయర్ నిర్వహించే 24 వేర్వేరు పరీక్షలకు 26 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతారు. వీరిలో దాదాపు 10 లక్షల మంది అభ్యర్థులు సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షకు హాజరవుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ