జనవరి 5న పంజాబ్ లో పీఎం మోదీ పర్యటన, రూ.42750 కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన

Assembly Election Live Updates, Mango News, PM Modi to lay foundation stones of multiple development projects, PM Modi to lay foundation stones of projects, PM Modi to visit Punjab, PM Modi to Visit Punjab on JAN 5th, PM Narendra Modi to visit Punjab on Jan 5 to lay foundation, PM Narendra Modi to visit Punjab on January 5, PM to visit Punjab on Jan 5, PM to visit Punjab on Jan 5 to lay foundation stone of projects, Will Lay Foundation Stone For Multiple Projects Worth of Rs 42750 Cr

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 5, బుధవారం నాడు పంజాబ్‌ రాష్ట్రంలోని ఫిరోజ్‌పూర్‌ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రూ.42,750 కోట్లకుపైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఢిల్లీ-అమృతసర్-కత్రా ఎక్స్‌ప్రెస్ వే, అమృత్‌సర్‌-ఉనా సెక్షన్ లో నాలుగు లేన్ల ఏర్పాటు, ముకేరియన్-తల్వారా కొత్త బ్రాడ్ గేజ్ రైల్వే లైన్, ఫిరోజ్‌పూర్‌లో పీజీఐ శాటిలైట్ కేంద్రం, కపుర్తలా మరియు హోషియార్‌పూర్‌లో రెండు కొత్త వైద్య కళాశాలలకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు.

ఈ ప్రాజెక్టులలో ముఖ్యంగా 669 కిలోమీటర్ల పొడవైన ఢిల్లీ-అమృత్‌సర్-కత్రా ఎక్స్‌ప్రెస్‌వే మొత్తం రూ.39,500 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. ఇది ఢిల్లీ నుండి అమృత్‌సర్ మరియు ఢిల్లీ నుండి కత్రాకు ప్రయాణ సమయాన్ని ఇది సగానికి తగ్గించనుంది. ఈ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే కీలక సిక్కు మత ప్రదేశాలు అయిన సుల్తాన్‌పూర్ లోధి, గోయింద్‌వాల్ సాహిబ్, ఖాదూర్ సాహిబ్, తార్న్ తరణ్ లను మరియు కత్రాలోని పవిత్ర హిందూ పుణ్యక్షేత్రం వైష్ణో దేవి ఆలయాలను కలుపుతుంది. అలాగే హర్యానా, చండీగఢ్, పంజాబ్ వంటి మూడు రాష్ట్రాలు మరియు జమ్మూ కాశ్మీర్‌ లలోని అంబాలా చండీగఢ్, మొహాలి, సంగ్రూర్, పాటియాలా, లూథియానా, జలంధర్, కపుర్తలా, కథువా మరియు సాంబా వంటి కీలక ఆర్థిక కేంద్రాలను కూడా ఈ ఎక్స్‌ప్రెస్ వే కలుపుతుందని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + fourteen =