
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ తాను కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు ప్రకటించారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా.. జన్ సురాజ్ పార్టీని తాను నెలకొల్పబోతున్నట్లు పీకే వెల్లడించారు. ప్రస్తుతం పీకే జన సురాజ్ పేరుతో పాదయాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే. అదే పేరును పార్టీకి పెట్టబోతున్నట్లుగా జులై 28న ప్రకటించారు.
పట్నాలోని బాపు సభాఘర్‌లో జన్ సురాజ్ పార్టీని ప్రారంభిస్తామని ప్రకటించిన ప్రశాంత కిషోర్.. లక్ష మందికిపైగా ఆఫీస్ బేరర్లతో పార్టీ ప్రారంభమవుతుందని చెప్పారు. జన్ సురాజ్ పార్టీకి తాను పార్టీ సభ్యులను నాయకులను ఎన్నుకుంటానని ఎన్నికల వ్యూహకర్త పీకే తెలిపారు. బిహార్‌కు మంచి ప్రత్యామ్నాయం లేదని చెప్పారు. మెరుగైన విద్య, ఉద్యోగాలు, ఆరోగ్య సంరక్షణ కోసం బిహార్‌కు చెందిన తర్వాతి తరాల ప్రజలెవరూ రాష్ట్రం విడిచి వెళ్లకుండా కృషి చేయాలని కోరారు.
బిహారీల భవిష్యత్తు తరాలు మంచి రేపటి కోసం.. కష్టపడాలని కార్యకర్తలకు పీకే సూచించారు. 2025లో జరిగే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తప్పక విజయం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఆగస్టు 15 నుంచి ఆగస్టు 20 వరకు ..ఏడుగురు సభ్యుల కమిటీ పార్టీలోని 25 అత్యున్నత పదవులకు ఎన్నికలు నిర్వహిస్తుందని చెప్పారు.
ఏడుగురు సభ్యుల కమిటీలో సమస్తిపూర్ నుంచి డాక్టర్ భూపేంద్ర యాదవ్, ముజఫర్‌పూర్ నుంచి స్వర్ణలతా సాహ్ని, బెగుసరాయ్ నుంచి ఆర్‌ఎన్ సింగ్,సివాన్ నుంచి న్యాయవాది గణేశ్ రామ్, రిటైర్డ్ ఐఏఎస్ సురేశ్ శర్మ, తూర్పు చంపారన్ నుంచి డాక్టర్ నసీమ్, భోజ్‌పూర్ నుంచి రిటైర్డ్ ఐఏఎస్ అరవింద్ సింగ్ ఉంటారని ప్రశాంత కిశోర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌తో పాుట మనుమరాలు జాగృతి ఠాకూర్ కూడా హాజరయ్యారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY