వైసీపీ హయాంలో ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. అప్పటి ప్రతిపక్షాలపై వారు తీవ్ర స్థాయిలో విరుచుకుపడే వారు. ప్రతిపక్ష నేతలపై మాటల తూటాలు పేల్చడంలో వైసీపీ నేతలను మించిన వారు లేరనే టాక్ కూడా ఉంది. కానీ ఏపీలో వైసీపీ అధికారం కోల్పోయినప్పటి నుంచి వైసీపీ నేతలు చల్లబడిపోయారు. వాటి నోటికి తాళం పడినట్లు అయింది. ఎన్నికల్లో ఓడిన కొందరు మంత్రులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మరికొందరు వారి సొంత పనులు చూసుకుంటూ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అధికార పక్షం నుంచి ఎదురయ్యే ఒత్తిళ్లను ఎలా ఎదుర్కోవాలని మరికొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మొన్నటి వరకు కూడా సైలెంట్‌గా ఉండిపోయాన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తిరిగి దూకుడు పెంచారు. అధికార పక్షంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికలవేళ విశాఖ తీరానికి వేల కోట్ల విలువ చేసే డ్రగ్స్‌తో కంటైనర్ వచ్చిన ఘటన కలకలం లేపిన విషయం తెలిసిందే. కానీ అప్పుడు ఎన్నికల సమయం కొనసాగుతున్నందున ఈ వ్యవహారంపై పెద్దగా ఎవరూ ఫోకస్ చేయలేదు. అయితే ఇప్పుడు అదే అంశాన్ని బొత్స పట్టుకున్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాల్సిందేనని పట్టు పడుతున్నారు. బ్రెజిల్ నుంచి వచ్చిన ఆ కంటైనర్ కేసు ఏమయిందని బొత్స సత్యనారాయణ ప్రభుత్వాన్ని నిలదీశారు. పాతిక వేల కోట్ల విలువైన డ్రగ్స్ అంటే చిన్న విషయం కాదని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఆ కంటైనర్‌పై ఉన్న సంధ్యా ఆక్వా మెరైన్ కంపెనీ బీజేపీ అధ్యక్షురాలి బంధువులదని అప్పట్లో ఆరోపణలు కూడా వచ్చాయని వెల్లడించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.
అలాగే గతంలో తాను చూసిన విద్యాశాఖపై కూడా విచారణ జరుపుకోవచ్చని సత్యనారాయణ వెల్లడంచారు. టీచర్ల బదిలీల్లో అక్రమాలు, ఆరోపణలపై ప్రభుత్వం విచారణ జరుపుకోవచ్చని అందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. పాఠశాలలు ఓపెన్ అయిన తర్వాత బదిలీలు అమలులోకి రావాలి స్వయంగా నోట్ పెట్టానని గుర్తు చేశారు. టీచర్ల బదిలీలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై విచారణను ప్రభుత్వం కోరుకుంటే జరిపిస్తారని.. తాను వద్దంటే ఆగుతారా? అని బొత్స ప్రశ్నించారు. మొత్తానికి మొన్నటి వరకు కూడ సైలెంట్‌గా ఉన్న సత్యనారాయణ తిరిగి యాక్టివ్ అయ్యారని విశ్లేషకులు అంటున్నారు. దీని వెనుక కూడా ఏదో వ్యూహం దాగి ఉండొచ్చని అంటున్నారు. అలాగే మొన్నటి వరకు బొత్స టీడీపీ లేదా జనసేనలోకి వెళ్లే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే బొత్స సత్యనారాయణ వైసీపీలోనే కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY