తెలంగాణలోని రైతులకు నేడు రెండో విడత రుణమాఫీ ప్రారంభించనుంది రేవంత్ సర్కార్. లక్షన్నర రూపాయల వరకు రుణాల మాఫీని అసెంబ్లీ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరవుతున్నారు. రెండో విడతలో సుమారు 7 లక్షల మంది రైతులకు సుమారు రూ. 7వేల కోట్ల రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం సిద్ధం అయింది. మూడు విడతల్లో రుణమాఫీ పూర్తి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక చేసిన విషయం తెలిసిందే.
ఈనెల 19న రేవంత్ సర్కార్ మొదటి విడత రుణమాఫీని ప్రారంభించింది. మొదటి విడతలో సుమారు 10.83 లక్షల కుటుంబాలకు చెందిన పదకొండున్నర లక్షల ఖాతాల్లో రూ. 6వేల కోట్లు జమ అయ్యాయి. ఆధార్ నెంబర్, ఇతర వివరాలు సరిగ్గా లేకపోవడం వంటి ఇతర కారణాలతో సుమారు 17వేల మందికి రుణమాఫీ డబ్బులు ఇంకా వారికి జమ కాలేదు. ఇక మూడో విడతలో లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయల వరకు రుణాలను ఆగస్టు 15వ తేదీలోగా ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.
ఇక లోక్ సభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం రూ. 2లక్షల్లోపు పంటరుణాలన్నీ మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కల్వకుర్తి సభలో తెలిపారు. బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు ఆగస్టులోపు రుణమాఫీ చేయాలన్న సవాల్ ను తాను స్వీకరించి ఈ రుణ మాఫీ చేస్తున్నట్లు తెలిపారు. మొదటి విడతగా రైతుల ఖాతాల్లో రూ. 6,093 కోట్లను జమ చేశామని చెప్పారు. రెండో విడతలో రూ.లక్షన్నర వరకు రుణాలు మాఫీ చేస్తామని అన్నారు. అలాగే మూడో విడతలో రూ. 2లక్షల వరకు రుణమాఫీ చేసి మూడు విడతల్లో రూ. 31వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని రేవంత్ చెప్పారు. కేవలం పాస్ బుక్ ఆధారంగానే రైతుల రుణమాఫీ చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE