నేడే టీఎస్‌పీఎస్సీ కీలక సమావేశం, గ్రూప్-1 నోటి‌ఫి‌కే‌షన్‌ ప్రకటనపై నిర్ణయం?

TSPSC To Meet Today To Take Decision on Group-1 Notification Release, tspsc group 1 recruitment 2022, 2022 tspsc group 1 recruitment, tspsc group 1 recruitment, telangana group 1 notification, TSPSC is likely to take a key decision on the release of the Group-1 notification, key decision on the release of the Group-1 notification, Group-1 notification, Telangana State Public Service Commission group 1 recruitment 2022, 2022 Telangana State Public Service Commission group 1 recruitment, Telangana State Public Service Commission, Telangana State Public Service Commission group 1 notification, group 1 notification, Group-1 Notification News, Group-1 Notification Latest News, Group-1 Notification Latest Updates, Group-1 Notification Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 27 శాఖలకు సంబంధించిన 80,039 పోస్టుల భర్తీ చేయనున్నట్టు ఇటీవలే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటిల్లో గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-3, గ్రూప్‌-4 పోస్టులు కూడా ఉన్నాయి. ముందుగా గ్రూప్‌-1 కు సంబంధించి 19 విభాగాలకు చెందిన 503 పోస్టులు భర్తీకి రాష్ట్ర ఆర్థికశాఖ పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది. దీంతో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) గ్రూప్‌-1 పోస్టుల భర్తీపై ఇప్పటికే దశలవారీగా సమావేశమై కసరత్తు చేసింది. ఈ నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ శనివారం నాడు మరోసారి కీలక సమావేశం నిర్వహిస్తుంది. ఈ సమావేశం అనంతరం గ్రూప్‌-1 నోటి‌ఫి‌కే‌షన్‌ ప్రకటనపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

నోటిఫికేషన్ల విషయంలో గతంలో జరి‌గిన పొర‌పాట్లు మళ్ళీ పునరావృతం కాకుండా లోటుపాట్లను సరిచేసి, ఏలాంటి సమ‌స్యలు రాకుండా మరియు కొత్త జోనల్‌ వ్యవస్థకు అనుగుణంగా గ్రూప్-1 నోటి‌ఫి‌కే‌షన్‌ ప్రకటన జారీచేయడంపై టీఎస్‌పీఎస్సీ దృష్టి సారించింది. అన్ని అనుకూలంగా ఉంటే ఈ నెలాఖరు లోపుగానే గ్రూప్-1 నోటి‌ఫి‌కే‌షన్‌ ను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసే అవకాశమునట్టు సమాచారం.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here