రెండోసారి అధికారంలోకి రావాలనే జగన్ ఆశలన్నీ నిరాశలయ్యాయి. వై నాట్ 175 నినాదంతో ముందుకెళ్లినప్పటికీ.. వైసీపీ కనీసం యాభై స్థానాలను కూడా దక్కించుకోలేకపోయింది. చిత్తు చిత్తుగా ఓడిపోయి కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమయిపోయింది. ఆ పదకొండు మంది వైసీపీ ఎమ్మెల్యేల్లో జగన్ కూడా ఒకరు. ఎన్నికల ఫలితాల అనంతరం కొద్దిరోజులు సైలెంట్ అయిపోయిన జగన్మోహన్ రెడ్డి.. ఆ తర్వాత కాస్త దూకుడు పెంచారు. కూటమి ప్రభుత్వంపై యుద్ధానికి పూనుకున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎదుట నల్ల కండువాలతో నిరసన తెలిపిన జగన్.. ఆ తర్వాత తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కీలక నేతలతో కలిసి హస్తినాలో పోరాటం చేశారు. జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించారు.
అయితే ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ జగన్ ఓ విషయంలో మాత్రం విజయం సాధించారనే ప్రచారం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తారా? లేదా? అన్నదానిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ జగన్ తొలిరోజు అసెంబ్లీకి హాజరు అయి.. ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అలా రెండు సార్లు అసెంబ్లీ జరగ్గా.. రెండుసార్లు కూడా తొలిరోజే జగన్ అసెంబ్లీకి హాజరయి మిగతా రోజులు డుమ్మా కొట్టారు. అయితే అసెంబ్లీకి అటెండ్ కాకపోవడం జగన్‌కు మైనస్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి తనకు అనుకూలంగా మలుచుకున్నారు. అదే ఇప్పుడు జగన్‌కు ప్లస్ పాయింట్ అయింది. కూటమి నేతలకు మైనస్ పాయింట్ అయింది.
తాను అసెంబ్లీకి హాజరు అయినప్పటికీ తనకు మైక్ ఇవ్వరని జగన్ అంటున్నారు. ప్రజా సమస్యలపై నేను మాట్లాడుతానని భావించి.. నాకు మైక్ ఇచ్చే ఉద్దేశంలో కూటమి నేతలు లేరని చెబుతున్నారు. ఇటీవల మీడియా ముందుకు వచ్చినప్పుడు కూడా జగన్ ఇదే చప్పారు. జగన్ చెప్పిన ఈ విషయం పెద్ద ఎత్తున జనాల్లోకి వెళ్లింది. ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీంతో స్పీకర్ అయ్యన్నపాత్రుడితో పాటు కూటమి నేతలు జగన్‌ని అసెంబ్లీకి రావాలని.. మైక్ ఇస్తామని కోరుతున్నారు. వారికి సమయం ఇస్తామని.. వారు మాట్లాడేందుకు మైక్ ఇచ్చే బాధ్యత తనదని ఇటీవల అయ్యన్నపాత్రుడు అన్నారు. ఒకరకంగా చూసుకుంటే ఈ విషయంలో జగన్ విజయం సాధించినట్లేనని విశ్లేషకులు అంటున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF