బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చే అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి

AP Govt Advisor Sajjala Ramakrishna Reddy Interesting Comments Over Supporting of BRS Party,AP Govt Advisor,Sajjala Ramakrishna Reddy,Ap Cm Ys Jagan Mohan Reddy,Mango News,Mango News Telugu,TRS Party MP's News and Live Updates,TRS Party,CM KCR,Telangana CM KCR,Telangana Chief Minister,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,winter session of Parliament,winter Parliament session

బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చే అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందిన నేపథ్యంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పొత్తుల అంశం లేదా ఆ పార్టీకి మద్దతిచ్చే విషయంపై తమ పార్టీ ఇంకా ఏమీ నిర్ణయించుకోలేదని తెలిపారు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ, లేదా సీఎం కేసీఆర్ నుంచి కానీ మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి అందితే అప్పుడు పరిశీలిస్తామని, పార్టీలో అంతర్గతంగా చర్చించిన మీదట ఒక నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

ఏపీలో బీఆర్ఎస్ పోటీ చేస్తే మంచిదేనని అయితే, ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునే ఆలోచన వైఎస్సార్సీపీకి లేదని తేల్చి చెప్పారు. దీనిపై సీఎం జగన్ నిర్ణయమే అంతిమమని, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా సరే పార్టీ మొత్తం పాటిస్తుందని పేర్కొన్నారు. అయినా ఒక రాజకీయ పార్టీగా ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చని, అయితే తమకు మాత్రం ఏపీ ప్రయోజనాలే ముఖ్యమని, పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడులో పోటీ చేసే ఉద్దేశం లేదని సజ్జల స్ఫష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − nine =