మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ ఫోటో ఆయన అభిమానులను కలవర పెడుతోంది. చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న చిరంజీవి పేరుతో కాంగ్రెస్ పార్టీ కొత్త ఐడీ కార్డు విడుదల అయిందంటూ సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవిని పీసీసీ డెలిగేట్ గా నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుందని. అంతేకాదు.. ఏపీసీసీ డెలిగేట్ గా గుర్తిస్తూ చిరంజీవి పేరుతో ఐడీ కార్డు రిలీజ్ చేసిందని. ఏపీ-2022/104 నెంబర్‌తో చిరంజీవికి కొత్త ఐడీ కార్డు ఇవ్వగా.. ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నట్లు ఐడీ కార్డులో పేర్కొన్నారు. ఏపీలోని ప్రతీ నియోజకవర్గం నుంచి ఇద్దరు పీసీసీ డెలిగేట్స్ ఉంటారు. చిరంజీవికి కొవ్వూరు సెగ్మెంట్ నుంచి డెలిగేట్‌గా అవకాశం ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి మెగాస్టార్ చిరంజీవికి ఐడీ కార్డు జారీ అయిన మాట వాస్తవమే కానీ ఇప్పుడు కాదు.
2022 లోనే చిరంజీవికి ఈ ఐడీ కార్డు జారీ అయింది. గాడ్ ఫాదర్ మూవీ రిలీజ్ సమయంలో చిరంజీవి చెప్పిన ఓ డైలాగ్ తెలుగుస్టేట్స్‌ని షేక్ చేసింది. పూర్తిగా పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఆ మూవీలో ఓ డైలాగ్‌ను చిరంజీవి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ”నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను.. రాజకీయం నా నుంచి దూరం కాలేదు..” ఇదే మెగాస్టార్ డైలాగ్. అయితే చిరంజీవి ఆ వీడియో పోస్టు చేసిన మరుసటి రోజే ఏఐసీసీ డెలిగేట్ గా గురిస్తూ ఐడీ కార్డు కూడా జారీ చేసింది. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన దగ్గర నుంచి చిరంజీవి ఆ పార్టీ సభ్యుడుగా ఉన్నారు చిరంజీవి. సాంకేతికంగా చిరంజీవి ఏనాడూ పార్టీకి రాజీనామా చేయలేదు. అందుకే ఆయన పేరు మీద ఏఐసీసీ ఐడీ కార్డు విడుదల చేసింది. మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని 2027 అక్టోబర్ నెల వరకు రెన్యువల్ చేసిన ఐడి కార్డును కాంగ్రెస్ పార్టీ విడుదల అయిందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో మెగాస్టార్ చిరంజీవి అభిమానులు షాక్ అయ్యారు.
రెండు సంవత్సరాల క్రితం జనసేన అధికారంలో లేకపోవడంతో ఎవరు అప్పుడు ఆ విషయాన్ని అంత సీరియస్ గా తీసుకోలేదు. కానీ ఇప్పుడు చిరంజీవి తమ్ముడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా అందరూ వేడుకలు నిర్వహిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ మెగాస్టార్ చిరంజీవి పార్టీ సభ్యత్వం రెన్యువల్ చేసిన ఐడీ కార్డు బయటకు రావడంతో మెగా ఫ్యాన్స్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇప్పుడయితే మెగాస్టార్ వరుస సినిమాలతో యువ హీరోలకు సాధ్యం కాని రీతిలో ఫుల్ బిజీగా ఉన్నారు. అంతే కానీ చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారని, కాంగ్రెస్‌లోనే కొనసాగుతారనే ప్రచారం అవాస్తవమని తెలుస్తుంది. తాను రాజకీయాల్లోకి రాను.. సినిమాలే చేసుకుంటానని గతంలో పలుమార్లు చెప్పిన మెగాస్టార్ ఈ ఐడీ కార్డు విషయంలో కూడా మెగాస్టారే స్పందించి ఓ క్లారిటీ ఇస్తే అభిమానులు ఫుల్ ఖుషీ అవుతారు.