టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ సంచలన నిర్ణయాన్ని ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తాను తప్పుకుంటున్నట్లు వెల్లడిస్తూ.. శిఖర్ ధావన్ ఎమోషనల్ ప్రకటన చేసాడు.అంతర్జాతీయ క్రికెట్ తో పాటు దేశవాళీ మ్యాచ్ లకు కూడా తాను దూరం అవుతున్నట్లు వీడియోను రిలీజ్ చేసాడు.
క్రికెట్ కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితంలో కూడా శిఖర్ ధావన్ చాలా సార్లు ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. దీనికితోడో కొంత కాలంగా శిఖర్ ధావన్ క్రికెట్ కు త్వరలోనే గుడ్ బై చెబుతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ప్రచారం జరిగినట్లే చివరకు శిఖర్ ధావన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ ను నిరాశకు గురి చేసింది.
టీమిండియా ఓపెనర్ గా..ఐపీఎల‌్‌లో పంజాబ్ టీమ్‌కు కెప్టెన్ గా శిఖర్ ధావన్ వ్యవహరించాడు. ప్రతీ ఐసీసీ టోర్నమెంట్ లో శిఖర్ ధావన్ ముద్ర ఉందన్నది కాదనలేని వాస్తవం. కొంత కాలంగా శిఖర్ ధావన్‌కు టీమ్ సెలక్షన్ లో తగిన ప్రాధాన్యత లభించటం లేదన్న వాదన వినిపిస్తోంది.దీనికి తోడు ఫామ్ విషయంలో కూడా శిఖర్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. పైగా వయసు పెరుగుతుండటంతో శిఖర్ ధావన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు శిఖర్ ధావన్ నిర్ణయంతో క్రికెట్ అభిమానుల చర్చతో సోషల్ మీడియా హీటెక్కుతోంది.
తన రిటైర్మెంట్ ప్రయాణంలో తనకు ఎంతో మంది తనకు సహాయం చేశారని…వారి వల్ల ఈ స్థాయికి వచ్చానంటూ శిఖర్ ధావన్ వీడియోలో తెలిపారు. భారతదేశం తరఫున ఆడినందుకు తనకు చాలా గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు. శిఖర్ ధావన్ తన రిటైర్మెంట్ ప్రకటనతో చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
ఇక తనకు భవిష్యత్ అవకాశాల పైన నమ్మకం లేకపోవడంతోనే శిఖర్ ధావన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శిఖర్ ధావన్ తన కెరీర్లో 167 వన్డేలు ఆడి 6వేల793 పరుగులు చేసాడు. అదే విధంగా 68 టీ 20లు ఆడిన శిఖర్ ధావన్.. 1,759 పరుగులు చేసాడు. 34 టెస్టులు ఆడి 2,315 పరుగులు చేసిన ఈ క్రికెటర్.. అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్లకు గుడ్ బై చెప్పేశాడు.