IPL 2025: ఆర్సీబీ వదులుకునే టాప్-3 ఆటగాళ్లు వీళ్లే!

IPL 2025 These Are The Top 3 Players RCB Will Give Up, Top 3 Players RCB Will Give Up, RCB Top 3 Players, These Are The Top 3 Players RCB Will Give Up, IPL 2024, IPL Mega Auction 2024, RCB, Virat Kohli, IPL 2025 RCB Top 3 Players, IPL 2025 Breaking News, IPL Auction Date 2025, IPL Franchises, IPL Retained Players List 2025, IPL 2025, IPL 2025 Is The Time For Mega Auction, Rohit Sharma, Rohit Sharma Play, Dhoni, kohli, BCCI, India, Latest IPL News, IPL Live Updates, Mango News, Mango News Telugu

ఐపీఎల్‌లో 17 సీజన్లు ముగిశాయి. ప్రతి సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ ఫేవరేట్‌గానే బరిలోకి దిగుతోంది. కానీ కప్ కల కలగానే మిగిలిపోతుంది. వరల్డ్ స్టార్ ప్లేయర్లు టీమ్‌లో ఉన్నా అదే రిజల్ట్ రిపీట్ అవుతుంది. ఫాఫ్ డుప్లెసిస్ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌లో మూడో స్థానంలో, 2023లో ఆరో స్థానంలో మరియు 2024 టోర్నమెంట్‌లో నాలుగో స్థానంలో నిలిచింది. అయితే 2025 ఐపీఎల్ టూర్‌కు ముందు మినీ వేలం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరు జట్టులో ఆటగాళ్లు పూర్తిగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మెగా వేలానికి ముందు జట్టును బలోపేతం చేయాలని, దాని కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ఆర్సీబీ ఫ్రాంచైజీ భావిస్తోంది. ఏ ఆటగాళ్లను రిటైన్ చేయాలి, ఏ ఆటగాళ్లను విడుదల చేయాలనే దానిపై ఆర్సీబీ లెక్కలు వేస్తోంది.

గత ఐపీఎల్ టోర్నీలో ఆర్సీబీ జట్టులోని టాప్ ఫోర్ బ్యాట్స్ మెన్ మాత్రమే బ్యాటింగ్ విభాగంలో మెరిశారు. ఆర్సీబీ కేవలం ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ పైనే ఆధారపడింది. ఈ సమస్యను పరిష్కరించడానికి, RCB మెగా వేలంలో తగిన ఆటగాళ్ల కోసం ప్రయత్నిస్తోంది. బౌలింగ్ విభాగంలోనూ ఆర్సీబీ పలు మార్పులు చేయనుంది. డెత్ ఓవర్లలో సమర్థులైన బౌలర్లను కూడా RCB కొనుగోలు చేయడానికి ప్రణాళికలు రచిస్తోంది. RCB ఆటగాళ్లలో కొందరిని మెగా వేలానికి ముందే విడుదల చేయవచ్చు.

1. ఫాఫ్ డుప్లెసిస్
మూడు ఎడిషన్ల తర్వాత, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తన కెప్టెన్‌ను మార్చాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో, నాయకత్వ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని 2025 ఐపీఎల్ మెగా వేలం సరైన అభ్యర్థి కోసం వెతుకుతుంది. ఫాఫ్ డు ప్లెసిస్ కెప్టెన్‌గా, ఆటగాడిగా సమర్థవంతంగా నే నడిపించాడు. ఫాఫ్ డు ప్లెసిస్ RCB తరుపున గత మూడేళ్లలో 45 మ్యాచ్‌లు ఆడి 1636 పరుగులు చేశాడు. అతని నాయకత్వంలో, RCB 2022 మరియు 2024లో ప్లేఆఫ్‌లకు అర్హత సాధించింది. అయితే RCB కప్ గెలవలేకపోయింది. డు ప్లెసిస్‌ను భర్తీ చేయాలని RCB తదుపరి కెప్టెన్‌గా ఎవరు ఉండాలనే దానిపై జట్టు మేనేజ్‌మెంట్‌ యోచిస్తంది.

2. గ్లెన్ మాక్స్‌వెల్
2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలంలో ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్‌ను బెంగళూరు ఫ్రాంచైజీ రూ. 11 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, అతను 2022 మరియు 2023లో మంచి ప్రదర్శన కనబరిచాడు, కానీ 2024 టోర్నమెంట్‌లో దారుణంగా విఫలమయ్యాడు అతను ఆడిన 9 ఇన్నింగ్స్‌లలో 52 పరుగులు మరియు 6 వికెట్లు మాత్రమే చేశాడు. ఫామ్ లో లేకపోవడం, గాయం కారణంగా ఈసారి అతడిని ఆర్సీబీ జట్టులో ఉంచడం అనుమానమే. మేజర్ లీగ్ క్రికెట్‌లో అతను మంచి ప్రదర్శన చేసినప్పటికీ RCB అతనిని కొనసాగించడం అనుమానమే. కాగా, మాక్సీని వదులుకోవడానికి మరో కారణం.. యువ ఆల్‌రౌండర్ విల్ జాక్స్ మెరుగైన ప్రదర్శన చేయడమని తెలుస్తోంది.

3. మహిపాల్ లోమ్రోర్
గత రెండు ఎడిషన్లలో యువ బ్యాట్స్‌మెన్ మహిపాల్ లోమ్రోర్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మద్దతు ఇచ్చింది. అయితే దీన్ని సద్వినియోగం చేసుకోవడంలో యువ బ్యాట్స్‌మెన్ విఫలమయ్యాడు. 2023 టోర్నీలో అతను ఆడిన 10 ఇన్నింగ్స్‌లలో కేవలం 135 పరుగులకే పరిమితమయ్యాడు. అతని స్ట్రైక్ రేట్ బాగానే ఉన్నప్పటికీ, నిలకడైన ప్రదర్శన చేయడంలో ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ విఫలమవుతున్నాడు. 2024లో కూడా 10 మ్యాచ్‌లు ఆడి 125 పరుగులు మాత్రమే చేశాడు. 33 పరుగులు అతని వ్యక్తిగత అత్యధికం. ఈ నేపథ్యంలో ఆర్సీబీ  అతన్ని అట్టిపెట్టుకోవడం దాదాపు అనుమానమే.