ఆ లిస్ట్‌లో మీ ఫోన్‌ ఉందా?

WhatsApp will not work on these smart phones from next month,WhatsApp will not work,WhatsApp on these smart phones,WhatsApp will not work from next month,Mango News,Mango News Telugu,Whatsapp,WhatsApp will not work, smart phones,WhatsApp will not work on smart phones,smart phones,Samsung Galaxy Note 2,Samsung Galaxy S,Samsung Galaxy S2,Samsung Galaxy Tab 10.1,Sony Xperia S2,Sony Xperia Z,WhatsApp Latest News,WhatsApp Latest Updates

తెల్లారి లేచింది మొదలు పడుకునే వరకూ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే యాప్ ఏంటి అంటే.. అంతా టక్కున వాట్సాప్ పేరే చెబుతారు. ఎందుకంటే కోట్లాదిమంది ప్రజలు ఈ మెసేజింగ్ యాప్‌ను ఉపయోగిస్తున్నారు.వాట్సాప్‌ను మించిన ఫీచర్లతో ఎన్ని మెసేజింగ్ యాప్‌లు వచ్చినా దీని క్రేజ్ ఎక్కడా తగ్గకుండా ఇంకా చెప్పాలంటే విచిత్రంగా రోజురోజుకు పెరుగుతుంది.

మారుతున్న టెక్నాలజీతో పోటీ పడుతూ వాట్సాప్ అందించే క్రేజీ అప్ డేటెడ్ ఫీచర్స్‌కు వినియోగదారులు ఎప్పుడూ ఫిదా అవుతూనే ఉంటారు. అందుకే ఎన్ని యాప్స్ వచ్చినా వాట్సాప్ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. అయితే కొత్త ఫీచర్లను అప్ డేట్ చేసే వాట్సాప్ యాప్‌ను కూడా అప్ డేట్ చేస్తూనే ఉంటుంది. దీంతో పాత ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో పనిచేసే స్మార్ట్ ఫోన్స్‌లో తన సేవలను నిలిపివేస్తుంటుంది వాట్సాప్ అప్పుడప్పుడు. ఇలాగే ఇప్పుడు కొన్ని డివైజ్‌లలో వాట్సాప్‌ తన సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఆండ్రాయిడ్‌ 4.1 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేసే ఫోన్లకు తన సపోర్ట్‌ను నిలిపివేస్తున్నట్లు వాట్సాప్‌ ప్రకటించింది. అక్టోబర్‌ 24 నుంచి ఈ కొత్త రూల్‌ అమల్లోకి రానుందని వాట్సాప్‌ అధికారికంగా ప్రకటన కూడా ఇచ్చింది.

ఆండ్రాయిడ్‌ 4.1 ఆపరేటింగ్ సిస్టమ్‌ తో పాటు.. అంతకంటే తక్కువ వెర్షన్‌ తో పని చేస్తున్న మొబైల్స్‌ లో ఇకపై వాట్సాప్‌ పని చేయదు. అయితే ఈ లిస్ట్‌లో ఉన్న కొన్ని మొబైల్ ఫోన్‌లు ప్రస్తుతం మార్కెట్లో పెద్దగా ఉపయోగంలోనే లేవు. అయితే ఒకవేళ ఎవరైనా సరే ఆ మొబైల్ ఫోన్‌లను ఇప్పటికీ ఉపయోగిస్తుంటే వాటిలో తమ సేవలు నిలిచిపోనున్నట్లు వాట్సాప్ తెలిపింది. ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌ 5.0, ఐఫోన్‌ 12 ఫోన్‌లలో మాత్రం వాట్సాప్‌ సేవలు కొనసాగనున్నాయి.

అక్టోబర్‌ 24వ తేదీ నుంచి వాట్సాప్‌ పనిచేయని మొబైల్ ఫోన్స్‌ జాబితాలో సామ్‌సంగ్‌ గ్యాలక్సీ నోట్‌2,సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎస్‌, సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎస్‌2, సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ట్యాబ్‌ 10.1, సోనీ ఎక్స్‌పీరియా ఎస్‌2, సోనీ ఎక్స్‌పీరియా జెడ్‌, సోనీ ఎరిక్స్‌ ఎక్స్‌పీరియా ఆర్క్‌ 3, , హెచ్‌టీసీ వన్‌,ఎల్‌జీ ఆప్టిమస్‌ జీ ప్రో, హెచ్‌టీసీ సెన్సేషన్‌, మోటోరోలా డ్రాయిడ్‌ రేజర్‌, మోటోరోలా జూమ్‌, ఆసుస్‌ ఈ ప్యాడ్‌ ట్రాన్స్‌ ఫార్మర్‌, ఏసర్‌ ఐసోనియా ట్యాబ్‌ ఏ 5003, హెచ్‌టీసీ డిజైర్‌ హెచ్‌డీ, ఎల్‌జీ ఆప్టిమస్‌ 2 ఎక్స్‌ ఉన్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 5 =