తెలంగాణలో.. ప్రస్తుతం పార్టీ ఫిరాయింపుల కేసుతో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ తరఫున విజయం సాధించి… కాంగ్రెస్ లో చేరిన పదిమంది ఎమ్మెల్యేలే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యారు. ఈ పదిమందిలో మొదట కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్, కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావులపై చర్యలు తీసుకోవాలంటూ గులాబీ పార్టీ కోర్టుకు వెళ్లింది. దీంతో ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మరి 90 రోజులు పూర్తయిన సందర్భంగా… తెలంగాణ హైకోర్టు కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంది.
నెల రోజుల్లోపు ఈ ముగ్గురిపై తెలంగాణ స్పీకర్ ఏదొక ఒక నిర్ణయం తీసుకోవాలని సోమవారం తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ ఈ ముగ్గురు నేతలపై స్పీకర్ వేటు వేయకపోయినట్లయితే కచ్చితంగా తామే వీరిని అనర్హుల్గా ప్రకటిస్తామని చెప్పకనే చెప్పింది హైకోర్టు. దీంతో ఈ ముగ్గురు పదవులు పోవడం గ్యారెంటీ అని రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు.
ఇక ఈ ముగ్గురి విషయం పక్కకు పెడితే..బీఆర్ఎస్‌కు బైబై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిన మరో ఏడుగురు పరిస్థితి కూడా అత్యంత దారుణంగా తయారయినట్లు తెలుస్తోంది. వారు కూడా కాంగ్రెస్ లో చేరి 90 రోజులకు దగ్గరకు రావడంతో..వారి పైన కూడా తెలంగాణ హై కోర్టు సీరియస్ గా వ్యవహరించే అవకాశం ఉంది.
అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఈ పది మంది ఎమ్మెల్యేలకు.. ఒకే ఒక్క అవకాశం కళ్ల ముందు ఉంది. ఈ పది మంది ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అలా కాదని హైకోర్టు చర్యలు తీసుకునేంత వరకూ ఈ పదిమంది రెబల్ ఎమ్మెల్యేలు వెయిట్ చేస్తే మాత్రం వాళ్ల రాజకీయ భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లడం గ్యారంటీ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
దీంతోనే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీలోకి చేరిన ఈ పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు త్వరలోనే రాజీనామా చేయబోతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో రేవంత్ రెడ్డి కాస్త ఇరుకున పడినట్లేనని.. ఆయనే స్వయంగా రంగంలోకి దిగినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండే అవకాశం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ ఈ పదిమంది కనుక ఇప్పుడు రాజీనామా చేస్తే… కచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి కాబట్టి.. మహారాష్ట్రతో పాటు తెలంగాణలో కూడా అతి త్వరలో ఈ పది నియోజకవర్గాలకు ఎన్నికలకు జరిగే ఛాన్స్ ఉంటుంది.