రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా శంకర్ డైరెక్షన్ లో రూపొందుతోన్న సినిమా గేమ్ ఛేంజర్. ఈ సినిమా ప్రారంభమై చాలా కాలం అయినా విడుదల తేదీపై క్లారిటీ రావటం లేదు. మెగా ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ గేమ్ ఛేంజర్ షూటింగ్ అభిమానుల సహనానికి పరీక్షలు పెడుతోంది. నిజానికి ఎప్పుడో విడుదల కావాల్సిన సినిమా. కానీ శంకర్ భారతీయుడు 2 చేయాల్సి రావడంతో ఆగిపోయింది. అప్పుడో షెడ్యూల్ అప్పుడో షెడ్యూల్ అంటూ ఏదో ఓ చిన్న హీరో సినిమా షూటింగ్ చేసినట్టుగా చేశాడు శంకర్. నిర్మాత దిల్ రాజు ఎట్టిపరిస్దితుల్లోనూ గేమ్ ఛేంజర్ సినిమాని క్రిస్మస్ 2024 న రిలీజ్ చేద్దామనే ఆలోచనలో ఉన్నారు.
అయితే ఎలాగోలా ఈ సినిమాకు సంబంధించి రామ్ చరణ్ పోర్షన్ అంతా పూర్తయింది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉంటుంది అనుకున్నారు. బట్ ఇక్కడే శంకర్ మార్క్ ట్విస్ట్ ఒకటి వచ్చింది. రామ్ చరణ్ పోర్షన్ అయిపోయింది కాబట్టి అదేం కష్టం కాదు. కానీ శంకర్ మళ్లీ రామ్ చరణ్ కు సంబంధించిన కొన్ని సీన్స్ ను రీ షూట్ చేయాలని చెప్పాడట. ఇందుకోసం ఓ వారం పాటు హీరో డేట్స్ కావాలని నిర్మాతకు చెప్పాడట. ఇది విని దిల్ రాజు కూడా ఆశ్చర్యపోయాడని టాక్. ఆల్రెడీ అయిపోయిందని చెప్పాక మళ్లీ డేట్స్ కావాలంటే చరణ్ ఏమంటాడో అని ఫీలవుతున్నాడట. మళ్లీ కొన్ని సీన్లు రీషూట్ చేసిన ఫైనల్ అవుట్ ఫుట్ మరో రెండు నెలల్లో వస్తుందనే నమ్మకం అయితే లేదట.
రామ్ చరణ్ కూడా డైరక్టర్ శంకర్ కే సపోర్ట్ చేస్తున్నారని తెలుస్తోంది. అందుతున్న సమాచారం మేరకు శంకర్ ప్రస్తుతానికి అవుట్ ఫుట్ పై కాన్ఫిడెంట్ గా ఉన్నారట. అయితే ఫైనల్ ఎడిట్ అయ్యాక డబుల్ చెక్ చేసుకుని మరీ రిలీజ్ డేట్ ఖరారు చేద్దామని చెప్పారట. కాగా రాయన్ సినిమా ప్రీ- రిలీజ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్ రాజు ని గేమ్ ఛేంజర్ విడుదల ఎప్పుడు అంటూ చరణ్ ఫ్యాన్స్ పట్టుపట్టారు. దీంతో ఆయన చెప్పక తప్పలేదు. గేమ్ ఛేంజర్ మూవీని క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తామని దిల్ రాజ్ ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. అన్నీ కుదిరితే డిసెంబర్ 20న గేమ్ ఛేంజర్ విడుదలవుతుంది. చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. కియారా అడ్వాణీ కథానాయిక. అంజలి, ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సునీల్, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.