ఇస్మార్ట్ శంకర్ మూవీ రివ్యూ

Ismart Shankar Movie Review,iSmart Shankar Movie Mouth Talk latest telugu movies news, iSmart Shankar Movie Public Talk, iSmart Shankar Movie Review, Ismart Shankar Movie Review And Ratings, Ismart Shankar Movie Story, Ismart Shankar Review, Ismart Shankar Telugu Movie Live Updates, Ismart Shankar Telugu Movie Public Response, Ismart Shankar Telugu Movie Review, Latest telugu movie reviews, Telugu Film News 2019, Mango News, Tollywood Cinema Updates

నటీనటులు: రామ్ పోతినేని, నభా నటేష్, నిధి అగర్వాల్, ఆశిష్ విద్యార్తి మరియు షాయాజీ షిండే
దర్శకుడు: పూరీ జగన్నాధ్                                                                                                                      సినిమాటోగ్రాఫర్: రాజ్ తోటా                                                                                                                          నిర్మాతలు : పూరీ జగన్నాధ్, ఛార్మి
సంగీతం : మణిశర్మ

ఎనర్జిటిక్ స్టార్ రామ్, పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో రూపొందిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలయింది. విడుదలకు ముందే మణిశర్మ కంపోజ్ చేసిన పాటలు ప్రేక్షకులను అలరించడంతో పాటు, రామ్ మాస్ గెటప్ లో తెలంగాణ యాస లో చెప్పిన డైలాగ్స్ ఈ సినిమా మీద మాస్ ప్రేక్షకులకు, అభిమానులకు అంచనాలను పెంచాయి. ల్యాండ్ సెటిల్మెంట్స్ చేసుకుంటూ, చాందినీ(నభా నటేష్) ప్రేమలో ఉన్న శంకర్, ఒక రాజకీయనాయకుడిని హత్య చేసి తప్పించుకునే క్రమంలో, జరిగిన పోలీస్ దాడిలో ఏమి జరిగింది? ఆ తరువాత శంకర్ ఎదురుకున్న పరిస్థితులు, సారా( నిధి అగర్వాల్) పాత్రతో కధ ఎలా ముందుకు సాగింది అనే ఆసక్తికర అంశాలు వెండితెరపై చూడాల్సిందే.

మాస్ అంశాలతో రూపొందిన ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలయింది, రామ్ గెటప్, కాస్ట్యూమ్స్, బాడీ లాంగ్వేజ్ మరియు డైలాగులు ప్రేక్షకులను అలరిస్తాయి, రామ్ నటనలో, డాన్సులో మరోసారి తన సత్తా చాటి పాత్రకు వంద శాతం న్యాయం చేసాడు. ఇక హీరోయిన్లుగా నటించిన నభా నటేష్ మరియు నిధి అగర్వాల్ వారి నటన, గ్లామర్ తో ప్రేక్షకులను అలరించారు. ప్రతినాయక పాత్ర చేసిన ఆశిష్ విద్యార్తి మరియు సీబీఐ ఆఫీసర్ పాత్రలో షాయాజీ షిండే వారి పాత్రలకు న్యాయం చేసారు. సాంకేతిక విభాగంలో సినిమాటోగ్రాఫర్ రాజ్ తోటా, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచారు. పాటలు, నేపధ్య సంగీతంతో మణి శర్మ ఆకట్టుకున్నాడు. సినిమా నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి, పూరీజగన్నాధ్ తన స్టయిల్లో మరో మాస్ సినిమాతో మ్యాజిక్ చేసాడు, డైలాగ్స్, ఫైట్స్,రొమాన్స్ సన్నివేశాల్లో తన పంధా కొనసాగిస్తూ, హుషారైన పాత్ర సృష్టించి రామ్ ని సరికొత్త పంధాలో చూపించాడు. ఈ సినిమా తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 3 =