అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై మరోసారి హత్యాయత్నం జరిగింది. రెండు నెలల క్రితం, పెన్సిల్వేనియా రాష్ట్రం బట్లర్ నగరంలో ఎన్నికల ప్రచార సభలో ట్రంప్ ప్రసంగిస్తుండగా ఓ యువకుడు ట్రంప్ పై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ట్రంప్ ప్రాణాలతో బయటపడ్డారు. ఆ ఘటన మరువక మందే తాజాగా మరోసారి కాల్పుల ఘటన జరగడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.
ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లోని తన గోల్ఫ్ కోర్టులో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా ఏకే47 తుపాకీతో అక్కడ తిరిగాడు. కాగా మరో వ్యక్తి డొనాల్డ్ ట్రంప్‌కు దాదాపు 275-450 మీటర్ల దూరం నుంచే ఈ కాల్పల ఘటనకు పాల్పడ్డాడు. కాల్పుల ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. దీంతో అతడిపై అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన యూఎస్ సీక్రెట్ సర్వీస్ పోలీసులు ట్రంప్‌ను వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించారు. మరో టీమ్ ఆ దుండగుడిని వెంబడించి పట్టుకుంది. తుపాకీతో ఉన్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పులు జరిపిన నిందితున్ని 58 ఏళ్ల ర్యాన్ వెస్లీ రౌత్‌గా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు గుర్తించారు.
అనంతరం నిందితుడిని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) ప్రశ్నించగా.. ట్రంప్‌ను హత్య చేసేందుకు తాను గన్‌ను తీసుకొచ్చినట్లు చెప్పాడు. కాల్పులు జరిపేందుకు వచ్చిన వ్యక్తి పేరు ర్యాన్ వెస్లీ రౌత్ అని గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసి పోలీసు స్టేషనుకు తరలించారు. మరోసారి ట్రంప్ పై కాల్పుల ఘటన చోటు చేసుకోవడంపై అక్కడ భద్రతా వైఫల్యం మరోసారి కొట్టొచ్చినట్టు కనబడుతుంది. యూఎస్ లోని సెక్యురిటీపై అనుమానాలు కలిగేలా చేస్తున్నాయి. ప్రపంచ అగ్ర రాజ్యాధినేతగా పనిచేసిన ఎక్స్ ప్రెసిడెంట్ పై ఒకిటి రెండు సార్లు ఈ ఘటన చోటు చేసుకోవడం అమెరికాల్లో రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.