బీజేపీలో చేరిన పటీదార్ కోటా ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్

Gujarat Ex-Congress Leader Hardik Patel Joins BJP ahead of Gujarat Assembly Elections, Hardik Patel Joins BJP ahead of Gujarat Assembly Elections, Gujarat Assembly Elections, Gujarat Ex-Congress Leader Hardik Patel Joins BJP, Gujarat Ex-Congress Leader Hardik Patel Likely to Join BJP On June 2nd, Ex-Congress Leader Hardik Patel Likely to Join BJP On June 2nd, Patidar leader Hardik Patel Likely to Join BJP On June 2nd, Hardik Patel likely to join BJP, Gujarat Former Congress leader Hardik Patel to join BJP on June 2, Gujarat Former Congress leader to join BJP on June 2, Ahead Of Gujarat Assembly Election, Hardik Patel decides to join BJP on June 2, Former Congress leader Hardik Patel, Hardik Patel will join the BJP on June 2, youth leader from Gujarat Hardik Patel is all set to join the Bhartiya Janta Party on June 2, Bhartiya Janta Party, Gujarat Ex-Congress Leader Hardik Patel, Ex-Congress Leader Hardik Patel News, Ex-Congress Leader Hardik Patel Latest News, Ex-Congress Leader Hardik Patel Latest Updates, Ex-Congress Leader Hardik Patel Live Updates, Mango News, Mango News Telugu,

పటీదార్ కోటా ఉద్యమ నాయకుడు, గుజరాత్ యువనేత హార్దిక్ పటేల్ ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు (జూన్ 2) హార్దిక్ పటేల్ అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. గాంధీనగర్ లోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో గుజరాత్‌ బీజేపీ అధ్యక్షుడు సీఆర్‌ పాటిల్‌, మాజీ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ సమక్షంలో హార్దిక్ పటేల్ బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వారు హార్దిక్ పటేల్ కు పార్టీలోకి సాదరంగా స్వాగతం పలుకుతూ, కాషాయ కండువా కప్పారు. బీజేపీలో చేరేముందు హార్దిక్ పటేల్ ట్వీట్ చేస్తూ, “దేశప్రయోజనం, రాష్ట్రప్రయోజనం, ప్రజాప్రయోజనాలు, సామాజిక ప్రయోజనాల భావాలతో నేటి నుంచి కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నాను. విజయవంతమైన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశానికి సేవ చేసే గొప్ప పనిలో నేను చిన్న సైనికుడిలా పని చేస్తాను” అని పేర్కొన్నారు. పదవి కోసం ఎలాంటి డిమాండ్‌లు పెట్టలేదని, పని చేయడానికే బీజేపీలో చేరుతున్నట్టు తెలిపారు. ఇతర పార్టీల నేతలు కూడా బీజేపీలో చేరాలని హార్దిక్ పటేల్ కోరారు. ఈ ఏడాది చివర్లోనే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో తాజాగా హార్దిక్ పటేల్ బీజేపీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ముందుగా పటీదార్‌ కోటా ఉద్యమం అనంతరం 2019లో హార్దిక్ పటేల్ కాంగ్రెస్‌ పార్టీలో చేరి, గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ గా కూడా పనిచేశారు. మే 19న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఘాటైన లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీ దేశం మరియు సమాజ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని ఆ లేఖలో ఆరోపించారు.కాంగ్రెస్ పార్టీ దేశం మరియు సమాజ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని ఆ లేఖలో ఆరోపించారు. గుజరాత్ కాంగ్రెస్ నాయకులు రాష్ట్రంలో వాస్తవ సమస్యలను పరిష్కరించడంలో ఇబ్బంది పడుతున్నారన్నారు. మూడేళ్ల పాటు కాంగ్రెస్ నేత‌ల‌తో క‌లిసి త‌న స‌మ‌యాన్ని వృథా చేసుకున్నాన‌ని చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ గా ఉన్నప్పటికీ కూడా తనకు ఎలాంటి అర్ధవంతమైన పని ఇవ్వలేదని రాజీనామా అనంతరం హార్దిక్ పటేల్ విమర్శించారు. అలాగే హిందువులు, రాముడుపై కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్న నాయకులపై చర్యలు తీసుకోకపోవడంపై కూడా ఆయన పార్టీ నాయకత్వాన్ని నిందించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కు రాజీనామా అనంతరం హార్దిక్ పటేల్ తాజాగా బీజేపీలో చేరారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + 12 =