కరోనా వ్యాక్సినేషన్ పై కేంద్రం కీలక నిర్ణయం, ముందస్తు రిజిస్ట్రేషన్‌ అక్కర్లేదు…

Corona Vaccination Drive, Corona Vaccination Programme, coronavirus vaccine distribution, COVID 19 Vaccine, Covid vaccine for all above 18 yrs, CoWin Covid 19 vaccine registration, CoWIN registration not mandatory for 18-45 age group, Mango News, Prior Online Registration not Mandatory for Above 18 Age Group, Prior Online Registration not Mandatory for Above 18 Age Group to Avail COVID-19 Vaccine, Registration on CoWIN, Registration on CoWIN must for those between 18 and 45, Vaccine registration on CoWIN

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ వేయించుకోవటానికి ముందుగా ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్న తప్పనిసరి నిబంధన ఏదీ లేదని, 18 ఏళ్ళు పైబడ్డవారు నేరుగా దగ్గర్లో ఉన్న వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్ళి అక్కడికక్కడే ఆన్ సైట్ రిజిస్ట్రేషన్ చేయించుకొని అదే రోజున వ్యాక్సిన్ తీసుకోవచ్చని కేంద్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. కోవిన్ పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి ఉన్న అనేక మార్గాలలో కామన్ సర్వీస్ సెంటర్స్ (సిఎస్సి) ద్వారా రిజిస్ట్రేషన్ అనేది కూడా ఒక ఆప్షన్ అని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఆశా కార్యకర్తలు/హెల్త్ వర్కర్స్ వంటివారు గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ కూడా లబ్ధిదారులను సమీకరించి వ్యాక్సిన్ వేసే చోటనే రిజిస్ట్రేషన్ చేయించటంతో పాటుగా వెంటనే వ్యాక్సిన్ వేస్తారని పేర్కొన్నారు. అలాగే 1075 హెల్ప్ లైన్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ కు అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు.

గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు అనుగుణంగా ఉండేలాగానే వ్యాక్సినేషన్ కార్యక్రమ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా జూన్ 13, 2021 నాటికి 28.36 కోట్ల లబ్ధిదారులు కోవిన్ పోర్టల్ లో నమోదు చేసుకోగా, అందులో 16.45 కోట్లు అనగా 58 శాతం మంది ఆన్ సైట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పారు. అలాగే జూన్ 13 నాటికి పంపిణీ చేసిన 24.84 కోట్ల వ్యాక్సిన్ డోసులలో 19.84 కోట్ల డోసులను అనగా 80 శాతం ఆన్ సైట్ రిజిస్ట్రేషన్/వాక్ ఇన్ ద్వారానే లబ్ధిదారులకు అందించినట్టు పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here