దేవర టైటిల్ అందుకే పెట్టాం: ఎన్టీఆర్

NTR Said The Reason For Giving The Title Devara, Reason For Giving The Title Devara, Devara Title Reason Said By NTR, Devara Title Reason, Devara Title, Actor Jr NTR, Anirudh Ravichander, Ayudha Pooja Song, Devara, Koratala Shiva, Movie News, NTR Devara, Devara, Devara Movie, Jr NTR, Koratala Shiva, Latest Devara Movie Update, Movie News, Devara Movie, Devara NTR Movie, Tollywood, Tollywood News, Tollywood Latest News, Tollywood Updates, Live Updates, Breaking News, Headlines, Live News, Mango News, Mango News Telugu

జూనియర్ ఎన్టీఆర్‌ ఆర్‌ఆర్ఆర్ తర్వాత చేసిన చిత్రం ‘దేవర’. ఈ సినిమా పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. సైఫ్‌ అలీఖాన్‌ ప్రతినాయకుడిగా నటించారు ’ రెండు భాగాలుగాతెరకెక్కుతున్న ఈ చిత్రం తొలి భాగాన్ని సెప్టెంబర్‌ 27న  విడుదల చేయనున్నారు. బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ ను తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా తో దర్శకుడు కొరటాల శివ పరిచయం చేయబోతున్నాడు. ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్ కాంబో కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందరి అంచనాలను అందుకునేలా వీరి జోడీ ఉంటుందని ఇప్పటికే విడుదలైన రెండు రొమాంటిక్ పాటలను చూస్తే అర్థం అవుతుంది. దేవర సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నా కొద్ది ఫ్యాన్స్‌, ప్రేక్షకుల్లో ఆసక్తి అంతకంతకు పెరుగుతూనే ఉంది. ట్రైలర్ విడుదల తర్వాత దేవర క్రేజ్‌ అమాంతం పెరిగింది.

‘దేవర’ రిలీజ్‌ దగ్గరపడుతున్న కొద్దీ టెన్షన్‌ పెరుగుతుందన్నారు ఎన్టీఆర్‌. పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది చిత్ర బృందం. తాజాగా చెన్నైలో జరిగిన  కార్యక్రమలో ఎన్టీఆర్‌ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. టీమ్‌ అంతా బెస్ట్‌ అవుట్‌పుట్‌ కోసం ఎంతో శ్రమించామని,  సినిమాపై నమ్మకంగా ఉన్నామని చెప్పారు. మరో పక్క టెన్షన్‌గా కూడా ఉందన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌’ మాదిరిగా, దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరువయ్యే టైటిల్‌ పెట్టాలనుకున్నాం. ఆ ఆలోచనతోనే ‘దేవర’ టైటిల్‌ ఫైనల్‌ చేశాం. ‘దేవర’ అంటే దేవుడు అని అర్థం అని ఆయన అన్నారు.

ఇక సంగీత దర్శకుడు అనిరుద్ధ్‌ పై ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘తన సంగీతంతో అనిరుద్ధ్‌ రవిచంద్రన్‌ అదరగొడుతున్నారు. భవిష్యత్తులో ఏఆర్‌ రెహమాన్‌ స్థాయికి వెళ్తాడు. అంతర్జాతీయ చిత్రాలకూ కంపోజ్‌ చేసే సత్తా అతనిలో ఉంది’’ అని తారక్‌ అన్నారు. గత వారం రోజులుగా చర్చ జరుగుతున్న దేవర ఆయుధ పూజ పాటను 19వ తారీకు ఉదయం 11 గంటలకు విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అందుకు సంబంధించిన ఒక పోస్టర్ నూ విడుదల చేయడం జరిగింది. దాంతో ఆ సమయం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండగా, అధికారిక ప్రకటన వచ్చిన 24 గంటల లోపే ఆయుధ పూజ సింగిల్ ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

ఆయుధ పూజా ఇంకా రెడీ అవ్వలేదని, అందుకే తేదీ ఇచ్చిన తర్వాత వాయిదా వేశారనే టాక్ వినిపిస్తోంది. అసలు విషయం ఏంటి అనేది చిత్ర యూనిట్‌ సభ్యులు క్లారిటీ ఇవ్వక పోవడంతో రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అనుకున్నట్లుగా రాని కారణంగానే ఆయుధ పూజ పాటను వాయిదా వేశారనే అభిప్రాయంను కొందరు నెటిజన్స్ వ్యక్తం చేస్తున్నారు. సినిమా విడుదల తర్వాత ఆయుధ పూజను చూస్తే బాగుంటుందని, ముందుగానే చూస్తే సినిమాలోని ట్విస్ట్‌ లు రివీల్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయని మేకర్స్ భావిస్తున్నారేమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అసలు విషయం ఏంటి అనేది మాత్రం మేకర్స్ క్లారిటీ ఇవ్వడం లేదు.