రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ నిర్మాత మృతి

Kamalakar Reddy, Kanulu Kanulanu Dochayante Movie Producer, Tollywood, Tollywood Breaking News, Tollywood News, Tollywood Producer, Tollywood Producer Kamalakar Reddy, Tollywood Producer Kamalakar Reddy Died, Tollywood Producer Kamalakar Reddy Died in Accident

నల్గోండ జిల్లా దామచర్ల మండలం కొండప్రోలు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ నిర్మాత, కెఎఫ్‌సీ నిర్మాణ సంస్థ మేనేజింగ్ పార్టనర్ కమలాకర్ రెడ్డి మృతి చెందారు. నిర్మాత కమలాకర్ రెడ్డి, తన తండ్రి నందగోపాల్ రెడ్డిని చికిత్స నిమిత్తం అంబులెన్స్ లో హైదరాబాద్ కు తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆగివున్న లారీని అంబులెన్స్ ఢీకొట్టడంతో కమలాకర్ రెడ్డితో పాటు ఆయన తండ్రి కూడా అక్కడికక్కడే మృతి చెందారు. అంబులెన్స్ డ్రైవర్ కు కూడా తీవ్ర గాయాలవడంతో సమీపంలోని మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించినట్టు తెలుస్తుంది. కేఎఫ్‌సి ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్ ద్వారా కమలాకర్ రెడ్డి ఇటీవలే “కనులు కనులను దోచాయంటే” సినిమాను తెలుగులో విడుదల చేశారు. కమలాకర్ రెడ్డి మృతి పట్ల పలువురు నిర్మాతలు, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + two =