ప్రముఖ హిందీ హాస్యనటుడు రాజు శ్రీవాస్తవ కన్నుమూత

Bollywood Actor-Comedian Raju Srivastava Passes Away in Delhi Today, Comedian Raju Srivastava Died, Raju Srivastava Passes Away in Delhi , Comedian Raju Srivastava Passes Away , Bollywood Actor-Comedian Raju Srivastava, Comedian Raju Srivastava, Mango News, Mango News Telugu, Comedian Raju Srivastava Death News, Comedian Raju Srivastav Passes Away At 58, Raju Srivastava Dies, Raju Srivastav Passes Away, Raju Srivastava Latest News And Updates

ప్రముఖ హిందీ హాస్యనటుడు రాజు శ్రీవాస్తవ కన్నుమూశారు. న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో ఆయన తుది శ్వాస విడిచారు. ఆగస్టు 10న ఆయన ఒక జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా ఛాతీలో నొప్పితో ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్చారు. వైద్యులు వాత్సవకు యాంజియోప్లాస్టీ నిర్వహించారు. అయితే ఆ తర్వాత వాత్సవకు బ్రెయిన్ డెడ్ అయినట్లు ప్రకటించారు. అప్పటినుంచి ఆయన అక్కడే చికిత్స తీసుకుంటున్నారు. నెలకు పైగా ఆయనకు వెంటిలేటర్‌పైనే చిత్స అందిస్తున్నారు. అయితే ఆ తర్వాత వాత్సవకు బ్రెయిన్ డెడ్ అయినట్లు వైడీలు ప్రకటించారు. కానీ ఇటీవలే ఆయన ఆరోగ్యం మళ్ళీ మెరుగుపడే సూచనలు కన్పిస్తున్నాయని, వైద్యానికి ఆయన శరీరం స్పందిస్తోందని ప్రకటించారు. ఇక శ్రీవాస్తవ కోలుకుంటారు అని అందరూ భావిస్తున్న తరుణంలో ఆయన కన్నుమూయడం అందరినీ విషాదంలోకి నెట్టింది.

ఇక రాజు శ్రీవాస్తవ మైనే ప్యార్ కియా, బాజీగర్, బాంబే టు గోవా మరియు ఆమ్దాని వంటి అనేక చిత్రాలలో చిన్న పాత్రలలో కనిపించడం ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించాడు. అతను 2005 సంవత్సరంలో మొదటి సీజన్ ప్రీమియర్‌తో ‘ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్’ అనే మొదటి-రకం స్టాండ్-అప్ కామెడీ టాలెంట్ హంట్ షోతో మంచి గుర్తింపుని పొందాడు. రాజు శ్రీవాస్తవ్ తన చక్కటి సమయస్ఫూర్తితో స్టాండ్-అప్ కామెడీ ప్రపంచంలో తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ తర్వాత బిగ్ బాస్ మూడో సీజన్‌లోకి కూడా ప్రవేశించాడు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ చైర్మన్‌గా ఉన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × five =