దేవర వెర్సస్ పుష్ప- 2

Devara Vs Pushpa 2, Pushpa 2 Vs Devara, Allu Arjun, Devara, Devara Ayudha Pooja, NTR, Pushpa 2, Pushpa 2 Jathara, Sukumar, Pan-India Movies, Devara, NTR Devara, Devara Movie, Jr NTR, Koratala Shiva, Anirudh Ravichander, Latest Devara Movie Update, Movie News, Devara Movie, Devara NTR Movie, Tollywood, Tollywood News, Tollywood Latest News, Tollywood Updates, Live Updates, Breaking News, Headlines, Live News, Mango News, Mango News Telugu

ఎన్టీఆర్ హీరోగా వస్తున్న ‘దేవర’ సినిమాలో ఇప్పటి వరకు వచ్చిన పాటలు ఒక ఎత్తైతే.. ఆయుధ పూజ సాంగ్ ఒక ఎత్తు అనేలా ఉంటుందని మూవీ యూనిట్ చెప్పటంతో నందమూరి ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే.. అదిగో, ఇదిగో అని ఊరిస్తున్నారు తప్ప.. ఈ సాంగును మాత్రం రిలీజ్ చేయడం లేదు మేకర్స్. ఇదే హైప్‌ మెయింటెయిన్ చేసి.. ఆయుధ పూజను డైరెక్ట్‌గా థియేటర్లోనే రిలీజ్ చేసేలా ఉన్నారా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.

ఒకవేళ అదే కనుక జరిగితే థియేటర్ లో ఆయుధ పూజకు థియటర్ దద్దరిల్లిపోతుందని అంటున్నారు. అనిరుధ్ ఆ రేంజ్ ట్యూన్ ఇచ్చాడని టాక్ నడుస్తోంది. అయితే.. దేవరకు ఆయుధ పూజ సాంగ్ ఎంత ఆయువుపట్టుగా మూవీ యూనిట్ భావిస్తుందో.. పుష్ప 2 సినిమాలో కూడా అలాంటి పాటే ఒకటి ఉందని చిత్ర యూనిట్ చెబుతోంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో పుష్ప 2 షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో మొత్తం నాలుగు పాటలు ఉన్నాయి. ఇప్పటికే పుష్పరాజ్, సూసెకీ సాంగ్ రిలీజ్ అయ్యి యూత్‌ను అట్రాక్ట్ చేస్తున్నాయి.

అయితే.. ఇప్పుడు పుష్ప 2లో రాబోతున్న జాతర పాట మాత్రం సినిమాకే హైలైట్ గా నిలుస్తుందట. ఎప్పటి నుంచో టాలీవుడ్ సర్కిల్స్ లో ఈ మాట గట్టిగా వినిపిస్తోంది. కానీ, ఈ పాటను లిరికల్ సాంగ్ ముందే రిలీజ్ చేయకుండా.. నేరుగా థియేటర్లలోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్.

థియేటర్స్ లోనే జాతర సాంగ్‌ని ఆడియన్స్ ఎక్స్ పీరియన్స్ చేయాలని సుకుమార్ అనుకుంటున్నాడట. సినిమా రిలీజ్ తర్వాత ఈ సాంగ్ సెన్సేషన్ అవుతుందన్న గట్టి నమ్మకంతో సుక్కూ ఉన్నాడు. మొత్తంగా.. ఈ పాటకు థియేటర్లు దద్దరిల్లడం ఖాయం అనే టాక్ బలంగా వినిపిస్తోంది.

అలాగే జాతర బ్యాక్ డ్రాప్‌లో వచ్చే యాక్షన్ ఘట్టాలు కూడా అద్భుతంగా వచ్చినట్లు తెలుస్తోంది. మరి సెప్టెంబర్ 27న రానున్న దేవర ఆయుధ పూజ సాంగ్ థియేటర్ ను దద్దరిల్లేలా చేస్తుందో.. డిసెంబర్ 6న రానున్న పుష్ప2 లోని జాతర సాంగ్ థియేటర్ ను షేక్ చేస్తుందో చూడాలి మరి.