దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులు, దారుణాలు, అకృత్యాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇక ఇటీవల కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య.. మహారాష్ట్ర థానే జిల్లాలోని బద్లాపూర్ పాఠశాలలో చిన్న పిల్లలపై స్కూల్ సిబ్బంది లైంగిక వేధింపుల ఘటనలు పెను సంచలనం సృష్టించాయి. ఇవే కాకుండా ఇంకా చాలా ఘటనలు జరుగుతున్నాయి. ఒంటరి మహిళా కనిపిస్తే చాలు వయసు తో సంబంధం లేకుండా లైంగిక దాడికి పాల్పడుతున్నారు. అంతే ఎందుకు బస్సుల్లో కూడా భద్రత లేకుండా పోతుంది. రన్నింగ్ బస్సులో ఈనెల 18న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై బాధిత మహిళ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రన్నింగ్ బస్సులో ప్రయాణిస్తున్న వివాహితపై లైంగిక దాడి జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రైవేటు ట్రావెల్ బస్సులో ప్రయాణిస్తున్న వివాహిత మహిళపై.. బస్సు క్లీనర్ లైంగిక దాడికి పాల్ప డ్డాడు. ఈ సంఘటన ఈ నెల 18న జరిగింది. ఆంధ్రప్రదేశ్ సామర్లకోటకు చెందిన మహిళ(28) హైదరాబాద్ కూకట్ పల్లి లో నివాసముంటోంది. స్వగ్రామానికి వెళ్లేందుకు ఈ నెల 18న బస్ బుక్ చేసుకుంది. బస్సు రన్నింగ్లో ఉండగా.. బస్సులో ఉన్న క్లీనర్.. ఆమె ఉన్న సీటు వద్దకు వచ్చాడు. బలవంతంగా ఆమె పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. లైంగికదాడికి పాల్పడే సమయంలో ఆమె కేకలు వేసేందుకు ప్రయత్నించగా.. క్లీనర్ బెదిరించాడు. దీంతో ఏం చేయలేని నిస్సాహాయ స్థితిలో ఆ మహిళ ఉండిపోయింది.
మహిళ మరుసటి రోజు సామర్లకోటలోని ఇంటికి చేరుకుంది. భయం భయంగా ఉండటంతో.. కుటుబం సభ్యులకు అనుమానం వచ్చింది. ఏం జరిగిదని కుటుబం సభ్యులు అడగ్గా.. బస్సులో జరిగిన ఘటన గురించి చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను తీసుకొని చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం. జరిగిన విషయం కుటుంబ సభ్యులకు చెప్పగా.. ఆమెను తీసుకొని కుటుంబ సభ్యులు చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేసారు. ప్రస్తుతం పోలీసులు సదరు బస్సు క్లినర్ ను పట్టుకునే పనిలో పడ్డారు.
ఈ ఏడాది జులై 31న కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో ఇద్దరు డ్రైవర్లు.. 26 ఏళ్ల యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. బస్సు తెలంగాణలోని నిర్మల్ నుంచి హైదరాబాద్ మీదుగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. చుట్టూ క్లాత్స్ పెట్టి.. యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇలా తరుచు ఘటనలు జరుగుతుండడం తో తల్లిదండ్రులు తమ పిల్లలను ఒంటరిగా ఎటైనా పంపాలంటే భయపడుతున్నారు. మరి ఈ దాడులకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.