ఇటీవలి కాలంలో టెస్టుల్లో విరాట్ కోహ్లీ ఆటతీరుపై ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ స్పందించాడు. గ్రేట్ సచిన్ టెండూల్కర్ అత్యధిక టెస్ట్ పరుగుల రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు కొట్టడం అసాధ్యమని తేల్చి చెప్పాడు. 2020 నుంచి కేవలం 2 సెంచరీలు మాత్రమే చేసిన కోహ్లీ టెస్టు సగటు 50 కి పడిపోయింది. భారత బ్యాటింగ్ సూపర్ స్టార్ 9 మ్యాచ్‌లలో 32.72 సగటుతో 1669 పరుగులు చేశాడు. ఫ్యాబ్ ఫోర్‌లో ఉన్న కోహ్లీకి తన సహచరులు – స్టీవ్ స్మిత్, జో రూట్ మరియు కేన్ విలియమ్సన్ – గత కొన్ని సంవత్సరాలుగా టెస్ట్ క్రికెట్‌లో అతని కంటే మంచి ప్రదర్శన చేస్తున్నారు.
114 టెస్టుల్లో 8871 పరుగులు చేసిన కోహ్లీ, రెడ్ బాల్ ఫార్మాట్‌లో టెండూల్కర్ అత్యధిక పరుగుల రికార్డును అధిగమించే రేసులో వెనకబడ్డాడని హాగ్ అభిప్రాయపడ్డాడు. విరాట్ ఇప్పుడు రెడ్ బాల్ క్రికెట్ లో సచిన్ రికార్డులను అధిగమిస్తాడని తాను అనుకోవడం లేదని పేర్కొన్నాడు. విరాట్ జోరు తగ్గిందని.. గత నాలుగేళ్లుగా కోహ్లీ నామమాత్రంగానే ఆడుతున్నాడని పేర్కొన్నాడు. రాబోవు 10 టెస్ట్ మ్యాచ్‌లలో విరాట్ అద్భుత ప్రదర్శన చేసిన రేసులో ముందటాడని తాను అనుకోవడం లేదన్నాడు. పైపెచ్చు ఒకవేళ విరాట్ మునపటి జోరు చూపకపోతే సచిన్ దరిదాపుల్లోకి కూడా చేరుకోడన అని హాగ్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నాడు.
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ కోవిడ్ తరువాత రెడ్ బాల్ క్రికెట్‌లో అద్భుతమైన ఆటతీరుతో రికార్డులు బద్దలు కొడుతున్నాడు. ఈ ఇంగ్లీషు ఆటగాడు 2021 నుండి 49 టెస్టుల్లో 4579 పరుగులు చేశాడు, ఇందులో 17 సెంచరీలు ఉన్నాయి, 2012లో టెస్ట్ కెరీర్ ప్రారంభించిన రూట్ మొదటి 9 సంవత్సరాల్లో చేసిన కంటే గత మూడు సంవత్సరాలోనే ఎక్కువ సెంచరీలు నమోదు చేశాడు. ప్రస్తుతం 922 రేటింగ్ పాయింట్లతో ICC టెస్ట్ బ్యాటర్‌గా అగ్రస్థానంలో ఉన్నాడు.
సచిన్ రికార్డు బద్దలు ఖాయం
టెస్ట్ క్రికెట్‌లో టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టగల ఏకైక ఆటగాడు రూట్ అని హాక్ అభిప్రాయపడ్డాడు. ఈ ఇంగ్లిష్ బ్యాటర్ టెస్టుల్లో సచిన్ కంటే 3519 పరుగులు మాత్రమే వెనుకబడి ఉన్నాడు. జో రూట్ 146 టెస్ట్ మ్యాచ్ ల్లో ప్రస్థుతం 12,000 పరుగులతో ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ 200 టెస్ట్ మ్యాచ్‌ల్లో దాదాపు 16,000 పరుగులు చేశాడు. అంటే రూట్ కనీసం ఇంకో నాలుగేళ్లు క్రికెట్ ఆడగలడు మరో 66 టెస్టులు ఆడినా ఇదే జోరు ప్రదర్శిస్తే 4 వేల పరుగలు చేయడం కష్టమైన పని ఏంకాదు. కాబట్టి జో రూట్ సచిన్ అత్యధిక పరుగుల రికార్డును అధిగమించగలడని నేను భావిస్తున్నాను అని బ్రాడ్ హాగ్ పేర్కొన్నాడు.