న్యూజిలాండ్ తో తోలి వన్డేలో డబుల్ సెంచరీతో చెలరేగిన శుభ్‌మన్‌ గిల్, భారత్ భారీ స్కోర్ 349/8

India vs New Zealand 1st ODI: Opener Shubman Gill Hits Double Hundred India Score 349/8,Shubman Gill double century,IND ODI against New Zealand, India scored a huge score of 349/8,Mango News,Mango News Telugu,India Vs New Zealand Schedule,India Vs New Zealand T20,India Vs New Zealand Test,India Vs New Zealand Hyderabad Tickets,India Vs New Zealand Upcoming Match,India Vs New Zealand Live,India Vs New Zealand Live Score,India Vs New Zealand 2023,India Vs New Zealand Wtc Final,India Vs New Zealand Live Score 2023,India Vs New Zealand 2Nd Test 2023,India Vs New Zealand Test 2023,India Vs New Zealand Highlights,India A Vs New Zealand A Live Score Today,India Legends Vs New Zealand Legends,Indian Vs New Zealand,India A Vs New Zealand A Today Match

భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య నేడు హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో (ఉప్పల్ స్టేడియం) జరుగుతున్న తోలి వన్డేలో భారత్ ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్ చెలరేగి ఆడారు. శుభ్‌మన్‌ గిల్ 149 బంతుల్లో 19 ఫోర్లు, 9 సిక్స్ లతో 208 పరుగులు చేశాడు. వన్డేల్లో భారత్ తరపున డబుల్ సెంచరీ సాధించిన ఐదో ఆటగాడిగా, అంతర్జాతీయంగా తొమ్మిదో ఆటగాడిగా శుభ్‌మన్‌ గిల్ రికార్డు సృష్టించాడు. అలాగే వన్డే క్రికెట్‌లో డబుల్ సెంచరీ సాధించిన అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా శుభ్‌మన్ గిల్ నిలిచాడు. శుభ్‌మన్‌ గిల్ కంటే ముందు వన్డేల్లో సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ (3 సార్లు), వీరేంద్ర సెహ్వాగ్, ఎంజే గుప్తిల్, క్రిస్ గేల్, ఫకర్ జామన్, ఇషాన్ కిషన్ మాత్రమే డబుల్ సెంచరీలు సాధించారు. తాజాగా శుభ్‌మన్‌ గిల్ కూడా వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ఐసీసీ ఎలైట్ గ్రూప్ ఆఫ్ ప్లేయర్‌ లలో చేరాడు. శుభ్‌మన్‌ గిల్ అద్భుత ప్రదర్శనతో భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోర్ చేసింది.

ముందుగా తోలి వన్డేలో టాస్‌ గెలిచిన భారత్ జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్‌ గిల్ ఇన్నింగ్స్‌ ప్రారంభించారు. రోహిత్ శర్మ (34), విరాట్ కోహ్లీ (8), ఇషాన్ కిషన్ (5), సూర్యకుమార్ యాదవ్ (31), హార్దిక్ పాండ్యా (28), వాషింగ్టన్ సుందర్ (12), శార్దూల్ ఠాకూర్ (3), కుల్దీప్ యాదవ్ (5*) కొద్దీ పరుగులకు అవుట్ అయినప్పటికీ, ఇన్నింగ్స్ ప్రారంభం నుంచి శుభ్‌మన్‌ గిల్ ఒంటరి పోరాటం చేస్తూ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. 87 బంతుల్లో సెంచరీ, 122 బంతుల్లో 150 పరుగులు, 145 బంతుల్లో డబుల్ సెంచరీ చేసి శుభ్‌మన్‌ గిల్ సత్తా చాటాడు. శుభ్‌మన్‌ గిల్ (208) పరుగులతో రాణించడంతో భారత్ భారీ స్కోర్ సాధించి న్యూజిలాండ్ ముందు 349 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. న్యూజిలాండ్ బౌలర్లలో షిప్లే 2, డ్యారి మిచెల్ 2, లాకి పెర్గుసన్, టిక్కనర్, సాంట్నర్ తలొక వికెట్‌ తీశారు.

ఈ వన్డేలో విశేషాలు:

  • వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడుగా శుభ్‌మన్‌ గిల్ గుర్తింపు పొందాడు.
  • వన్డేల్లో అత్యంత వేగంగా 1,000 పరుగులు చేసిన భారత ఆటగాడిగా శుభ్‌మన్ గిల్ నిలిచాడు.
  • అత్యంత వేగంగా 3 వన్డే సెంచరీలు చేసిన 2వ భారత ఆటగాడు శుభ్‌మన్ గిల్ గుర్తింపు పొందాడు.
  • భారత్ తరుపున వన్డేల్లో 150 పరుగులు చేసిన అతి పిన్న వయస్కుడిగా శుభ్‌మన్ గిల్ నిలిచాడు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − three =