జానీ మాస్టర్ కేసులో ట్విస్ట్.. తెరపైకి డైరెక్టర్ సుకుమార్ పేరు…

Twist In The Johnny Master Case Director Sukumars Name On The Screen, Director Sukumars Name On The Screen, Twist In The Johnny Master Case, Johnny Master Case Twist, 376 Rape Case Against Jani Master, Director Sukumar, Johnny Master, Johnny Master Arrested, The Sexual Case On Jani Master, Dancers Association, Zero Fir Filed Against Choreographer, Janasena Big Shock To Jani Master, Tollywood, Tollywood News, Tollywood Latest News, Tollywood Updates, Live Updates, Breaking News, Headlines, Live News, Mango News, Mango News Telugu

ప్రముఖ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల వ్యవహారం కేసులో జానీ మాస్టర్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకొని ఆయనను విచారణ చేస్తున్నారు. అయితే జానీ మాస్టర్ విచారణలో పలు ఆసక్తికర విషయాలను చెబుతున్నట్టు సమాచారం. అయితే పోలీసుల విచారణలో బాధితురాలే తనను వేధించిందని జానీ మాస్టర్ చెప్పినట్లు సమాచారం. అంతే కాదు ఈ కేసులో జానీ మాస్టర్ డైరెక్టర్ సుకుమార్ పేరును ప్రస్తావించినట్లు సమాచారం.

నాపై బాధితురాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవి. ఢీ షో ద్వారా తనకు తానే పరిచయం చేసుకుంది. మైనర్‌గా ఉన్న సమయంలో లైంగిక దాడి చేశాననేది అబద్ధం. తన టాలెంట్‌ను గుర్తించి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా అవకాశం ఇచ్చాను. తనని పెళ్లి చేసుకోవాలని బాధితురాలు మానసికంగా హింసించేది… ఎన్నోసార్లు బాధితురాలు నన్ను బెదిరింపులకు దిగింది.. నేను పడుతున్న ఇబ్బందిపై డైరెక్టర్ సుకుమార్‌ దృష్టికి తీసుకెళ్ళాను. సుకుమార్ పిలిచి మాట్లాడిన కూడా బాధితురాలిలో మార్పు రాలేదు. నాపై కుట్ర జరిగింది, వెనున ఉండి నాపై కుట్ర చేశారు. నా ఎదుగుదలను ఓర్వలేకనే ఈ కేసులో ఇరికించారు’’ అంటూ జానీ మాస్టర్ విచారణలో పోలీసులకు తెలియజేశారు. ఏది ఏమైనా ఈ కేసులో సుకుమార్ కు చాలా విషయాలు తెలుసు అని జానీ మాస్టర్ చెప్పడంతో కొత్త చర్చ మొదలైంది.

మరోవైపు భర్తను కలవడానికి జానీ మాస్టర్ భార్య నార్సింగి పోలీస్ స్టేషన్‌‌కు వచ్చారు. ఈ కేసులో నాలుగు రోజుల పాటు జానీమాస్టర్‌ను పోలీస్ కస్టడీకి రంగారెడ్డి కోర్టు అనుమతించింది. ఇప్పటికే మూడు రోజుల పాటు జానీమాస్టర్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించగా.. రేపటి (శనివారం)తో జానీ మాస్టర్ కస్టడీ విచారణ ముగియనుంది. రేపు ఉదయం జానీ మాస్టర్‌ను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.