సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న చిరంజీవి

Chiranjeevi steps out of the Sankranti race

సాధారణంగా తెలుగు సినిమాలకు సంక్రాంతి ఎంత పెద్ద పండుగో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుసగా వచ్చే భోగి, సంక్రాంతి, కనుమ ..ఈ మూడు రోజుల సెలవు దినాలను క్యాష్ చేసుకోవడానికి బడా హీరోలు, నిర్మాతలు తెగ ప్రయత్నం చేస్తారు.దీనిలో భాగంగానే తమ సినిమాలను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తుంటారు. అయితే ఇక్కడ మెగా స్టార్ చిరంజీవి..రామ్ చరణ్ కోసం సంక్రాంతి బరి నుంచి తప్పుకుంటున్నారన్న వార్తలతో చిరు ఫ్యాన్స్ డిజప్సాయింట్ అవుతున్నారు.

గతేడాది వాల్తేరు వీరయ్య సినిమాతో సంక్రాంతి బరిలో దిగి .. బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న మెగాస్టార్ వచ్చే ఏడాది సంక్రాంతికి ఆల్రెడీ బుక్ చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బింబిసార సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ వశిష్ట మల్లిడి డైరక్షన్లో మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా సెట్స్ మీద ఉంది. ఈ మూవీని సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదల చేయాలని..ప్రాజెక్టు ప్రకటించిన తొలిరోజే రిలీజ్ డేట్‌ను ఎనౌన్స్ చేశారు. అయితే మెగాస్టార్ అభిమానులకు కన్ఫ్యూజన్లో పడేస్తూ సినిమా తేదీని వాయిదా వేసినట్లు ప్రకటించిన మూవీ టీమ్.. ఆ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

మరోవైపు ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఇమేజ్ ని సొంతం చేసుకున్న రామ్ చరణ్.. ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే రూ.100 కోట్లు వృధా అయినా..బడ్జెట్ విషయంలో నిర్మాత దిల్ రాజు ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదు. ఇదిలా ఉండగా ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదల చేస్తున్న ఈ మూవీని క్రిస్మస్ హాలీడేస్ లో డిసెంబర్ 20న వచేయాలని ప్లాన్ చేసిన మూవీ టీమ్ ..ఇప్పుడు రిలీజ్ డేట్ మారుస్తూ సంక్రాంతి బరిలోకి వస్తున్నట్లు ప్రకటించింది.దీంతోనే మెగాస్టార్ సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఇటు చిరంజీవి విశ్వంభర మూవీ విఎఫ్ఎక్స్ ఇంకా పూర్తి కాలేదు . దీంతో పాటు చిరంజీవి నెల రోజులకు పైగా చికెన్ గున్యాతో బాధపడుతుండటంతో.. పాల్గొనాల్సిన షూటింగ్ భాగం ఇంకా మిగిలే ఉంది. అందుకే సంక్రాంతి లోపు రిలీజ్ అంటే షూటింగ్ కంప్లీట్ చేయడం కష్టం కాబట్టి ఈ సినిమాను విడుదల తేదీ వాయిదా వేసి.. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.