సుశాంత్ సింగ్ కేసు: సీబీఐ దర్యాప్తుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం

Bihar Chief Minister Nitish Kumar, CBI Probe In Sushant Singh Rajput Case, CBI Probe In Sushant Singh Rajput Suicide Case, Nitish Kumar, sushant singh rajput, Sushant Singh Rajput CBI Probe, Sushant Singh Rajput Death Case, Sushant Singh Rajput Suicide Case

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ మృతిపై గత కొన్నిరోజులుగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ రోజు ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుశాంత్ సింగ్ కేసు దర్యాప్తును పాట్నా నుంచి ముంబయికి బదిలీ చేయమని కోరుతూ రియా చక్రవర్తి వేసిన పిటిషన్‌ను ఈ రోజు‌ సుప్రీం కోర్టు విచారించింది. ఈ సందర్భంగా సుశాంత్ సింగ్ మరణంపై సీబీఐ దర్యాప్తు కోసం బీహార్ ప్రభుత్వం చేసిన సిఫారసును కేంద్ర ప్రభుత్వం అంగీక‌రించిన‌ట్టుగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు. సుశాంత్ సింగ్ మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతుండడంతో ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని బీహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ కేంద్రానికి అభ్యర్ధన పంపారు. ఇందుకు కేంద్రం అంగీకారం తెలపడంతో ఇకపై ఈ కేసును సీబీఐ విచారించనుంది.

ముందుగా ఈ కేసును ముంబయి పోలీసులు దర్యాప్తు చేయడం ప్రారంభించారు. సుశాంత్ తండ్రి కేకే సింగ్‌ పాట్నాలో ఫిర్యాదు చేయడంతో బీహార్ పోలీసులు కూడా రంగంలోకి దిగారు. ఈ క్రమంలో ఇరు రాష్ట్రాలలో విచారణ సందర్భంగా పలు సంఘటనలు చోటుచేసుకున్నాయి. అలాగే సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదని, హత్యకు గురై ఉంచొచ్చని సుబ్రమణ్యస్వామి, బీజేపీ నాయకుడు నారాయణ్‌ రాణె సహా పలువురు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ కేసు పలు మలుపులు తిరుగుతూ వస్తుంది. కాగా సుశాంత్ సింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని మొదటినుంచే అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. తాజా కేంద్ర నిర్ణయంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 4 =