పియర్స్ పండు వర్షాకాలంలో ఎక్కువగా లభిస్తుంది. ప్రజలు ఈ పండును తినడానికి చాలామంది పెద్దగా ఇష్టపడరు. కానీ దీనిలో ఉండే పోషక విలువలు తెలిస్తే మాత్రం..అస్సలు లైట్ తీసుకోలేరు . ఈ పియర్స్ ను తెలుగులో బేరి పండు అంటారు. యాపిల్ కంటే ఎక్కువ తియ్యగా ఉంటూ.. ఎక్కువగా ఫైబర్ ఉండే పండు ఇది. దీనిలో నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో పోషకాలు పుష్కలంగా కలిగి ఉంటాయి. ఎక్కువ బరువు ఉన్నవాళ్లు ఇవి తినడం వల్ల శరీరానికి ఫైబర్ అందుతుంది.
ముఖ్యంగా డయాబెటిస్ పేషెంట్లు పియర్స్ దివ్య ఔషధం. డయాబెటిస్ పేషెంట్స్ లో చక్కెర స్థాయిలను తగ్గించి ఆరోగ్యంగా ఉండడానికి ఇది ఎంతో సహకరిస్తుంది. ఈ పండులో ఫ్లేవనాయిడ్స్, మాంగనీస్, విటమిన్ ఎ, సి, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, పొటాషియం, మెగ్నిషియం, కాపర్, ఫైబర్, ఫోలేట్ వంటి పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. రక్తహీనత సమస్యతో బాధపడుతున్నవారికి హిమోగ్లోబిన్ స్థాయిలని పెంచడమే కాకుండా ఎనర్జీ లెవల్స్ ను పెంచడంలో సహాయపడే పోషకాలు కూడా ఈ పండ్లలో పుష్కలంగా ఉంటాయి. ఈ పండును నిత్యం ఆహారంగా తీసుకోవడం వల్ల రోజంతా ఎంతో శక్తివంతంగా, ఉత్సాహంగా ఉంటారు.
పియర్స్ పండ్లు మీ చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుతాయి. పియర్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను దూరం చేస్తుంది.దీనివల్ల ప్రధానంగా మలబద్ధకం సమస్య తగ్గుతుంది. అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న వారు పియర్స్ పండ్లను తరచూ తినాలి. దీనిని తినడం వల్ల కడుపు నిండుగా ఉన్న భావన కలిగి ఇతర ఆహారపదార్ధాలు తక్కువగా తీసుకుంటారు. ఈ పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల త్వరగా ఆకలి వేయకుండా బరువును నియంత్రణలో ఉంచుతాయి. బెరి పండులో ఉండే పోషక విలువలు వల్ల రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ బయటకు పోతుంది.