దసరా పండుగ సమయంలో నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దేశంలో కోట్లాది సంఖ్యలో ఉన్న నిరుద్యోగుల కోసం ఓ సరికొత్త పథకాన్ని కేంద్రం ప్రారంభించబోతోంది. గత బడ్జెట్ లో హామీ ఇచ్చినట్లుగా నిరుద్యోగ యువత కోసం పీఎం ఇంటర్న్ షిప్ పథకాన్ని ప్రారంభించబోతోంది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు దీని కోసం ప్రత్యేకంగా రూపొందించిన పోర్టల‌్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభిస్తోంది.
అఫిషియల్‌గా పోర్టల్ ప్రారంభించిన వెంటనే.. నిరుద్యోగ యువత ఇందులో తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. అయితే పీఎం ఇంటర్న్ షిప్ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కేంద్రం కొన్ని అర్హతలు ఉండాలని నిబంధన పెట్టింది. దీనిలో ఫుల్ టైమ్ కోర్సులకు గాను ఎవరూ దరఖాస్తు చేసుకుని ఉండకూడదు.
21-24 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న నిరుద్యోగులే దీనికి అర్హులు. అంతేకాదు ఎక్కడా ఫుల్ టైమ్ ఉద్యోగం చేస్తూ ఉండకూడదు కేవలం నిరుద్యోగులకు మాత్రమే ఈ పోర్టల్ అందుబాటులో ఉంటుంది. అలాగే అతను లేదా ఆమె కుటుంబంలో తల్లితండ్రులు కానీ, భార్య లేదా భర్త కానీ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ ఉండకూడదు. అంతేకాకుండా కుటుంబంలో ఏ ఒక్కరికీ కూడా ఏడాదికి 8 లక్షల రూపాయలకు మించి ఆదాయం ఉండకూడదు
పీఎం ఇంటర్న్ షిప్ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి..https://pminternship.mca.gov.in/login/ వెబ్ సైట్ కి వెళ్లాలి. దీనిలో యూత్ రిజిస్ట్రేషన్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో రిజిస్టర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న వారికి దేశంలోనే టాప్ కంపెనీల్లో ఒక ఏడాది పాటు ఇంటర్న్ షిప్ చేసే అవకాశాన్ని కేంద్రం కల్పిస్తుంది.
నెలకు 4500 రూపాయలను కేంద్రం, మరో 500 సదరు సంస్థ ఇంటర్న్‌లకు చెల్లిస్తాయి. అలాగే ఏడాదిలో ఒకసారి 6 వేల రూపాయలను ఇన్సిడెంటల్ ఖర్చుగా చెల్లిస్తుంది. వీటితో పాటు ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనతో పాటు ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కింద ప్రతి ఇంటర్న్‌కు బీమా కవరేజీని కూడా కల్పిస్తారు.