న్యూజిలాండ్‌తో జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో తడబడినప్పటికీ పాకిస్థాన్, శ్రీలంకలపై మంచి ప్రదర్శనతో విజయం సాధించిన భారత్ మహిళల జట్టు టీ20 ప్రపంచకప్ సెమీ-ఫైనల్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. సెమీస్‌పై దృష్టి సారించిన భారత్ నేడు ఆస్ట్రేలియాపై భారీ తేడాతో గెలవాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో మంచి రన్‌రేట్‌ను కొనసాగించడం భారత్‌కు అత్యవసరంగా మారింది.
ఆస్ట్రేలియా మూడు మ్యాచ్‌లు గెలిచి 6 పాయింట్లు సాధించి 2.786 పరుగులతో అగ్రస్థానంలో ఉంది. భారత్ రెండు మ్యాచ్‌లు గెలిచి 0.576 రన్ రేట్‌తో 2వ స్థానంలో ఉంది. ఇదే సమయంతో న్యూజిలాండ్ 0.282 రన్ రేట్‌తో 3వ స్థానంలో ఉంది. ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో రెండింట్లో ఓడిన పాకిస్థాన్ రన్ రేట్‌లో చాలా వెనుకబడి ఉంది, కాబట్టి పుంజుకోవడం చాలా కష్టం. శ్రీలంక ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో నాలుగింటిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ దశలో భారత్, న్యూజిలాండ్ మధ్య పోటీతో ఆస్ట్రేలియా సాఫీగా సెమీస్ లో అడుగు పెట్టడం ఖాయం.
అయితే తొలి మ్యాచ్‌లో భారత్‌పై విజయం సాధించిన కివీస్ మహిళల జట్టు మళ్లీ భారత్ సెమీఫైనల్‌కు చేరుకోవడంలో అడ్డంకిగి మారారు. శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీని ద్వారా రన్ రేట్ కూడా పెరిగి మూడో స్థానంలో నిలిచింది. తద్వారా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగే చివరి ఎ లీగ్ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తేనే భారత్ సెమీస్‌లోకి ప్రవేశించగలదు. అదే విధంగా ఆస్ట్రేలియాపై భారత్ ఓడిపోతే న్యూజిలాండ్‌కు గెలిచిన ఓడిన సంబంధం లేకుండా భారత్ సెమీస్ కు చెరుతుంది. తర్వాతి మ్యాచ్‌ల్లో రెండు జట్లు ఓడిపోయినప్పుడు రన్ రేట్ కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుత లెక్కల ప్రకారం భారత్ రన్ రేట్ బాగుంది.
తొలి మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ, తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన హర్మన్‌ప్రీత్ జట్టు ఆత్మవిశ్వాసంతో పుంజుకుంది. ముఖ్యంగా అంతకుముందు జరిగిన మ్యాచ్ లో శ్రీలంకపై భారత్ 82 పరుగుల తేడాతో విజయం సాధించడం ప్రత్యర్థుల్లో వణుకు పుట్టించింది. అందుకే తర్వాతి మ్యాచ్ లోనూ రాణిస్తే పటిష్ట ఆస్ట్రేలియాను ఓడించడం కష్టమేమీ కాదు. ఇదిలా ఉంటే, ఆస్ప్రలియా గాయం సమస్యలతో బాధపడుతోంది. కెప్టెన్ అలిస్సా హీలీ, బౌలర్ తాల్యా గాయపడడం జట్టుకు ఎదురుదెబ్బ.
టీమ్ ఇండియా సెమీ ఫైనల్ మార్గం ఎలా ఉందంటే
- ఆస్ట్రేలియాపై టీమిండియా అద్భుత విజయం సాధించాలి.
- న్యూజీలాండ్ జట్టు పాకిస్థాన్ లేదా శ్రీలంక జట్టుపై ఓడాలి.
- పాకిస్థాన్, న్యూజీలాండ్ మధ్య జరిగే మ్యాచ్‌లో పాకిస్థాన్ గెలవాలి, కానీ ఆస్ట్రేలియాపై మాత్రం ఓడాలి.
తదుపరి మ్యాచ్‌ల్లో పాకిస్థాన్ లేదా న్యూజీలాండ్ విజయం సాధించినా, నెట్ రన్ రేట్లో వెనుకబడాలని ఆశించాలి.
టీమ్ ఇండియా
హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మందన (వైస్ కెప్టెన్), యస్తిక భాటియా (వికెట్ కీపర్), షెఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్జ్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), పూజా వస్త్రేకర్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్, డి హేమలత, ఆశా శోభనా, రాధా యాదవ్, రాంకా పాటిల్, యాష్ సజ్నా.