ఒలింపిక్స్ లో భారత్ కు మరో పతకం ఖరారు చేసిన బాక్సర్‌ లవ్లీనా

Boxer Lovlina Borgohain Reached to Semis Assures Second Medal, Boxer Lovlina Borgohain Reached to Semis Assures Second Medal for India, Boxing, Lovlina Borgohain assured of Olympic boxing medal, Lovlina Borgohain assures India of Olympic medal, Lovlina Borgohain assures medal for India, Mango News, Tokyo 2020 boxing, Tokyo Olympics, Tokyo Olympics 2020, Tokyo Olympics 2020 Opening, Tokyo Olympics News, Tokyo Olympics Updates

టోక్యో ఒలింపిక్స్-2020 క్రీడల్లో భారత్ కు మరో పతకం ఖరారైంది. భారత బాక్సర్‌ లవ్లీనా బొర్గోహెన్ సెమీస్ కు దూసుకెళ్లి చరిత్ర సృష్టించింది. 69 కేజీల విభాగంలో శుక్రవారం ఉదయం జరిగిన క్వార్టర్ ఫైనల్లో చైనీస్‌ తైపీకి చెందిన మాజీ వరల్డ్‌ చాంపియన్‌ నీన్‌ చిన్‌ చెన్‌ పై 4-1 తేడాతో విజయం సాధించి లవ్లీనా సెమీస్ కు చేరుకుంది. ఈ విజయంతో లవ్లీనాకు కాంస్య పతకం ఖరారైంది.

అస్సాంకు చెందిన 23 ఏళ్ల లవ్లీనా ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనడం ఇదే మొదటిసారి. బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ లో రెండుసార్లు కాంస్య పతకం గెలుచుకున్న లవ్లీనా, ఒలింపిక్స్ మెడల్ కూడా సొంతం చేసుకోబోతుంది. బాక్సింగ్ లో భారత్ తరపున ఒలింపిక్స్ లో ఇప్పటివరకు 2008లో విజేందర్ సింగ్, 2012లో మేరీ కోమ్ కాంస్య పతకాలు సాధించారు. కాగా లవ్లీనా సెమీఫైనల్లో టర్కీకి చెందిన బుసెనాజ్ సుర్మెనెలితో తలపడనుంది. సెమీస్ లో విజయం సాధిస్తే ఫైనల్ కు వెళ్లనుండగా, ఓడిపోయినా కాంస్య పతకం దక్కించుకోనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here