కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన కూడా మహిళలపై దాడులు మాత్రం ఆగడంలేదు. పోక్సో, నిర్భయ వంటి కఠిన చట్టాలు అమలు పరుస్తున్న కూడా కామాంధులు మాత్రం మారడంలేదు. ప్రతి చోట అమ్మాయిలపై వేధింపుల ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. ఈ క్రమంలో బస్టాండ్, రైల్వేస్టేషన్, మెట్రోలు, పని ప్రదేశాలలో కూడా మహిళలు వేధింపులకు గురౌతున్నారు. అయితే.. కొన్ని చోట్ల యువతులు ఇంట్లో వాళ్ల నుంచి వేధింపులను ఎదుర్కొంటున్నారు. తాజాగా హైదరాబాద్లో యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపుతోంది.
గచ్చిబౌలిలోని ఓ నిర్మాణ సంస్థలో పనిచేస్తున్న యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆర్సీపురం నుంచి గచ్చిబౌలి వెళ్లేందుకు యువతి ఆటో ఎక్కింది. అప్పటికే యువతి కూడా చాలా అలసిపోయి ఉండటంను వీరు గమనించారు. రాత్రి పూట ఆటోను గచ్చీబౌలీ సమీపంలోని మసీదు బండ దగ్గరకు పొనిచ్చారు. అక్కడ ఆటోను ఒక్కసారిగా పొదల్లోకి తీసుకెళ్లి యువతిపై అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా.. యువతిని ఇద్దరు కలిసి పొదల్లోకి లాక్కెళ్లి అరవకుండా.. కాళ్లు చేతులు, పట్టుకుని అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. బాధితురాలు తీవ్రమైన పెనుగులాట చేసినట్లు కూడా తెలుస్తొంది. కానీ కామాంధుల పశుబలం ముందు మాత్రం ఆమె వారిని నిలవరించలేకపోయినట్లు తెలుస్తోంది. కాసేపటికి యువతిని వదిలేసి.. కామాంధులు ఆటోలో అక్కడి నుంచి పరారయ్యారు.
ఈ వ్యవహారం పై బాధిత యువతీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై ఇద్దరు యువకులు అత్యాచారం చేసారని, అనంతరం ఇద్దరు పారిపోయారని తెలిపింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అత్యాచారానికి పాల్పడిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
కాగా హైదరాబాద్ ఆడ పిల్లలకు ఎక్కడ కూడా రక్షణ లేకుండా అయిపోయిందని. బాగా చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న కూడా రాత్రి సమయంలో ఇంటికి వెళ్ళే సమయంలో భయంతో వణికి పోతున్నారు. ఎక్కడి నుండి ఏ కామాంధుడు వచ్చి కాటేస్తాడోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేస్తున్నారు.