నేడు పాలకుర్తిలో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి ఎర్రబెల్లి

Telangana Minister Errabelli Unveils Ex President Abdul Kalam's Statue at Palakurthi on His Death Anniversary, Minister Errabelli Unveils Ex President Abdul Kalam's Statue at Palakurthi on His Death Anniversary, Errabelli Unveils Ex President Abdul Kalam's Statue at Palakurthi on His Death Anniversary, Ex President Abdul Kalam's Statue at Palakurthi on His Death Anniversary, Ex President Abdul Kalam Death Anniversary, Ex President Abdul Kalam's Statue at Palakurthi, Abdul Kalam's Statue at Palakurthi, Ex President Abdul Kalam, Former President Abdul Kalam, Abdul Kalam, Palakurthi Abdul Kalam Statue, Telangana Minister Errabelli, Minister Errabelli, Palakurthi Abdul Kalam Statue News, Palakurthi Abdul Kalam Statue Latest News, Palakurthi Abdul Kalam Statue Latest Updates, Palakurthi Abdul Kalam Statue Live Updates, Mango News, Mango News Telugu,

భారత మాజీ రాష్ట్రపతి డా. ఏపీజే అబ్దుల్ కలాం.. తన జీవిత‌కాలం విద్యావేత్తగా, గొప్ప శాస్త్రవేత్తగా సమాజం కోసం పాటుపడిన మహనీయుడు అని పేర్కొన్నారు పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు. ఈ మేరకు జనగామ జిల్లాలోని పాల‌కుర్తిలో జిల్లా ప‌రిష‌త్ పాఠ‌శాల‌లో ఏర్పాటు చేసిన‌ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ క‌లాం విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. నేడు అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం విశేషం. ఈ క్రమంలో ఇటీవలి ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల్లో ఉత్తమ ప్రతిభ క‌న‌బ‌ర‌చిన పాఠ‌శాల‌ విద్యార్థుల‌కు మంత్రి స‌న్మానం చేశారు.

విగ్రహావిష్కరణ అనంతరం మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ప‌ట్టుద‌ల‌తోనే అసాధ్యాలు సుసాధ్యం అవుతాయని, అందుకు నిద‌ర్శనమే భారత మాజీ రాష్ట్రపతి డా. ఏపీజే అబ్దుల్ కలాం అని అన్నారు. ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన కలాం పట్టుదలతో బాగా చదివి రాష్ట్రపతి స్థాయికి చేరుకున్నారని తెలిపారు. ఆయన తన జీవితమంతా సమాజ శ్రేయస్సు కోసం పాటుపడ్డారని, ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం అని ఎర్రబెల్లి పేర్కొన్నారు. ఆ మహానుభావుడి విగ్రహాన్ని మన పాలకుర్తిలో పెట్టడం అభినందనీయమని తెలిపారు. ఈ విగ్రహ ఏర్పాటుకు చొరవ చూపిన ‘హెల్పింగ్ హ్యాండ్స్’ గంట రవీందర్‌ను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఇక ప‌దో త‌ర‌గ‌తిలో 10కి 10 మార్కులు సాధించిన ఐదుగురు విద్యార్థులకు త‌మ స్వచ్ఛంద సంస్థ త‌ర‌పున ర‌వీంద‌ర్ త‌లా 10వేల చొప్పున నగదు బహుమతి అందించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + 9 =