తెలంగాణలో పలు ప్రవేశ పరీక్షలను నిర్వహించే యూనివర్సిటీలు, కన్వీనర్లు ఖరారు

TSCHE has Decided Universities and Appointed Conveners to Conduct of TS CETs-2023,TSCHE Decided Universities,TSCHE Appointed Conveners,TS CETs-2023,Mango News,Mango News Telugu,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

తెలంగాణ రాష్ట్రంలో 2023-24 విద్యా సంవ‌త్స‌రానికి గానూ వివిధ సాంకేతిక, వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షల నిర్వహణకు సంబంధించి పలు యూనివర్సిటీలకు బాధ్యతలు అప్పగిస్తూ తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. అలాగే ఉమ్మడి ప్రవేశ పరీక్షలను నిర్వహించడానికి సంబంధిత యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌లతో తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఫ్రొఫెసర్ లింబాద్రి సంప్రదించి టీఎస్ సెట్స్-2023 కన్వీనర్‌లను కూడా నియమించారు. 2023-24 విద్యా సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రంలోని ప్రొఫెషనల్ కాలేజీలలో అందించే వివిధ యూజీ మరియు పీజీ ప్రొఫెషనల్ కోర్సులలో ప్రవేశానికి టీఎస్ సెట్స్-2023 షెడ్యూల్‌లు తర్వాత ప్రకటించబడతాయని పేర్కొన్నారు.

తెలంగాణలో పలు ప్రవేశ పరీక్షలను నిర్వహించే యూనివర్సిటీలు, కన్వీనర్ల వివరాలు:

  1. టీఎస్ ఎంసెట్ – జేఎన్టీయూహెచ్ – ప్రొఫెస‌ర్ బీ.డీన్ కుమార్ (కన్వీనర్)
  2. టీఎస్ పీజీ ఈసెట్ – జేఎన్టీయూహెచ్ – ప్రొఫెస‌ర్ బీ.ర‌వీంద్ర రెడ్డి (కన్వీనర్)
  3. టీఎస్ ఐసెట్ – కాకతీయ యూనివర్సిటీ – ప్రొఫెస‌ర్ పీ.వ‌ర‌ల‌క్ష్మి (కన్వీనర్)
  4. టీఎస్ ఈసెట్ – ఉస్మానియా యూనివర్సిటీ – ప్రొఫెస‌ర్ శ్రీరాం వెంక‌టేశ్ (కన్వీనర్)
  5. టీఎస్ లాసెట్ అండ్ టీఎస్ పీజీఎల్‌సెట్ – ఉస్మానియా యూనివర్సిటీ – ప్రొఫెస‌ర్ బీ.విజ‌య‌ల‌క్ష్మి (కన్వీనర్)
  6. టీఎస్ ఎడ్‌సెట్ – మహాత్మాగాంధీ యూనివర్సిటీ – ప్రొఫెస‌ర్ ఏ.రామ‌కృష్ణ (కన్వీనర్)
  7. టీఎస్ పీఈసెట్ – శాతవాహన యూనివర్సిటీ – ప్రొఫెస‌ర్ రాజేష్ కుమార్ (కన్వీనర్).

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + twenty =