గ్రూప్-1 అభ్యర్థుల ధర్నా.. మద్దతు తెలిపిన కేటీఆర్

KTR Post As Ex Platform To Support Group 1 Candidates, To Support Group 1 Candidates, KTR Post As Ex Platform, Ex Platform, Group 1 Candidates, Group 1 Aspirants Protest, Job Aspirants Protest, KTR Ex Platform Post, Hyderabad Live Updates, Latest Hyderabad News, Telangana, TS Politics, TS Live Updates, Political News, Mango News, Mango News Telugu

హైద‌రాబాద్‌లోని గ్రూప్-1 అభ్యర్థులు మరోసారి నిర‌స‌న‌కు దిగారు. ఈనెల 21 నుంచి జరిగే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ అభ్య‌ర్థులు నిరసన చేపట్టారు. గతంలో జరిగిన ప్రిలిమ్స్ పరీక్షల్లో తప్పులు జీవో 29 సవరించిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని అభ్య‌ర్థులు త‌మ డిమాండ్‌ను వినిపిస్తూ నిర‌స‌న‌కు దిగారు. దీంతో అశోక్ న‌గ‌ర్‌లో ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా మారింది. ఒక్క‌సారి అశోక్ న‌గ‌ర్‌లోని గ్రూప్-1 అభ్య‌ర్థులు రోడ్డుపైకి వ‌చ్చి ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నిర‌స‌న తెలిపారు. విష‌యం తెలుసుకున్న పోలీసులు అశోక్ న‌గ‌ర్‌లో మోహ‌రించారు. ఆందోళన చేస్తున్న అభ్యర్థులను అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు.

ఎక్స్ వేదిక‌గా కేటీఆర్‌కు పోస్ట్‌
మమ్మల్ని క్షమించాలి. మీరు అశోక్ నగర్ రావాలి, మాకు మీ మద్దతు అవసరం ఉంది. అన్ని వ్యవస్థలు మాకు అన్యాయం చేస్తున్నాయి. మీ మద్దతు ఉంటే మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది. గ్రూప్ 1 అభ్యర్థులంతా ఏకతాటిపైకి వచ్చి మీకు సర్వదా రుణపడి ఉంటాం’ అంటూ గ్రూప్‌ 1 అభ్యర్థులు ట్వీట్ చేశారు. ఉద్యోగాల విషయంలో తమకు మద్దతు తెలపాలని గ్రూప్‌ 1 అభ్యర్థులు అర్ధరాత్రి కోరగా.. వస్తున్నా.. మిమ్మల్ని కలుస్తున్నా అంటూ బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ మాట ఇచ్చారు. తమకు మీ మద్దతు కావాలని కోరిన గ్రూప్స్ 1 అభ్యర్థుల అభ్యర్థన మేరకు వారిని కలుస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ మేరకు ‘ఎక్స్‌’లో అభ్యర్థుల విజ్ఞప్తికి స్పందించి రిప్లయ్‌ ఇచ్చారు.
కేటీఆర్ ట్వీట్ చేసిన అనంరతం రాత్రి 9 నుంచి 10 గంటల మధ్య అశోక్‌ నగర్‌ చౌరస్తాలో గ్రూప్‌ 1 అభ్యర్థులు అకస్మాత్తగా ధర్నా చేపట్టారు. అశోక్‌నగర్‌ గ్రంథాలయం నుంచి చౌరస్తాకు చేరుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకుని వారిని నిలువరించారు. కొద్దిసేపు ఒక చోట ఆగి అభ్యర్థులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. అయితే ఆందోళన చేపట్టేందుకు అభ్యర్థులు తరలివస్తుండడం… సంఖ్య పెరిగిపోతుండడంతో పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు అనుచితంగా ప్రవర్తించి అభ్యర్థులను రోడ్లపైకి లాకెళ్లారు.

హ‌రీశ్ రావు ఆగ్రహం
తమకు న్యాయం చేయాలంటూ శాంతియుతంగా నిరసన తెలియచేస్తున్న గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగ విద్యార్థులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్న‌ట్లు మాజీ మంత్రి హ‌రీశ్ రావు ఎక్స్ వేదిక‌గా పోస్ట్ చేశారు. అరెస్టు చేసి బేగం బజార్ పోలీస్ స్టేషన్ కు తరలించిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు ఆయ‌న పేర్కొన్నారు. విద్యార్థులు నివసించే అశోక్ నగర్ లో కరెంట్ లేకుండా చేసి, అక్రమంగా నిర్భందించడమేనా మీ ప్రజా పాలన? అని ప్ర‌శ్నించారు. ఎన్నికల సమయంలో మీ నాయకుడు రాహుల్ గాంధీ అశోక్ నగర్ లైబ్రరీకి వచ్చి ఓట్లు అడిగిన విషయం మరిచిపోయారా? హామీలు ఇచ్చి విద్యార్థులను మభ్యపెట్టిన రోజులు గుర్తులేవా? పది నెలల పాలన పూర్తి కాకముందే విద్యార్థుల పట్ల మీరు చూపిన కపట ప్రేమ అసలు రంగు బయట పడింది సీఎం రేవంత్ రెడ్డి.? విద్యార్థుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తున్న మీ దుర్మార్గ విధానాన్ని మార్చుకోవాలని హెచ్చరిస్తున్నామ‌ని ఆయ‌న రాసుకొచ్చారు.